పవన్ కు కొత్త టెన్షన్, ఆశలు ఆవిరి - వాట్ నెక్స్ట్..!?
తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఏ మేర సత్తా చాటనుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఆసక్తికర చర్చగా మారుతోంది. ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన..తెలంగాణలో బీజేపీ మిత్రపక్షంగా ఎన్నికల బరిలోకి దిగింది. ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తుంది. ప్రధాని ఎన్నికల సభలోనూ పవన్ పాల్గొన్నారు. ఈ సమయంలోనే జనసేనకు కొత్త సమస్య మొదలైంది. జనసేన ఆశలు ఆవిరి అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు.
8 సీట్లలో జనసేన: తెలంగాణలో ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీ నేతలు జనసేనకు 8 సీట్లు కేటాయించారు. కూకట్‌పల్లి (ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్), తాండూరు (నేమూరి శంకర్ గౌడ్), కోదాడ (మేకల సతీష్ రెడ్డి) , నాగర్‌కర్నూలు (వంగల లక్ష్మణ్ గౌడ్), ఖమ్మం (మిర్యాల రామకృష్ణ), కొత్తగూడెం (లక్కినేని సురేందర్ రావు), వైరా (తేజావత్ సంపత్ నాయక్), అశ్వారావు పేట (ముయబోయిన ఉమాదేవి) స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఈ పోటీ సమయంలో జనసేనకు కొత్త సమస్య మొదలైంది. జనసేన గుర్తు గాజు గ్లాసు. అయితే.. మరో పార్టీ పేరు, గుర్తు కూడా ఇంచుమించు ఇలాగే ఉండటంతో తమ ఓటింగ్ నష్టపోతామనే టెన్షన్ జనసేన నేతల్లో మొదలైంది.
సింబల్ సమస్య: తెలంగాణ ఎన్నికల బరిలో భారతీయ జనసేన అనే మరో పార్టీ పోటీలో ఉంది. ఆ పార్టీకి బకెట్ గుర్తు కేటాయించారు. పార్టీ పేర్లతో పాటు, గుర్తులు కూడా ఈవీఎంల మీద ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు ఉంటాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇప్పుడు కుకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుండటం..అక్కడ ఏపీ మూలాలు కలిగిన వారు ఎక్కువగా ఉండటం తో అక్కడ జనసేనకు వచ్చే ఓట్లు..ఫలితం పైన ఆసక్తి నెలకొంది. అదే కుకట్ పల్లిలో జాతీయ జనసేన అభ్యర్థి నిలబడుతుండటంతో పవన్ కల్యాణ్‌కు టెన్షన్ తప్పటం లేదు. కుకట్ పల్లిలో తమ సత్తా చాటుతామని తొలి నుంచి జనసేన శ్రేణులు చెబుతూ ఉన్నాయి. కానీ, ఇప్పుడు అక్కడ పార్టీ ఆశలు ఆవిరి కావటం ఖాయంగా కనిపిస్తోంది.

ఏం చేయబోతున్నారు: 2018 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న విధంగానే గుర్తులు ఒకే విధంగా ఉంటే జరిగే నష్టాన్ని నేతలు వివరిస్తున్నారు. 2018 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే జరిగింది. బీఆర్ఎస్ గుర్తు కారు కాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు ఇవ్వడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో వేముల వీరేశంకు పడాల్సిన ఓట్లన్నీ రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి.
ఓట్లు చీలిపోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. అయితే.. జాతీయ జనసేన అభ్యర్థిని నామినేషన్ విరమించుకునేలా చేయాలని జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్.. పార్టీ అధినేత పవన్‌ను గట్టిగా కోరుతున్నారు. అదే జరిగితే జనసేనకు మేలు జరుగుతుంది. సాధ్యం కాకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు సమస్యగా మారుతోంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications