అల్లు అర్జున్ కు అండగా జనసేన కీలక నేత-కర్మ ఎవరినీ వదలదని హెచ్చరిక..!
హైదరాబాద్ సంధ్య థియేటర్లో పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో హీరో అల్లు అర్జున్ చిక్కుల్లో పడ్డారు. చిక్కడపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన అల్లు అర్జున్ ను ఇవాళ మరోసారి విచారణకు కూడా పిలిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరుగుతోందన్న చర్చ కూడా జరుగుతోంది.
ఇలాంటి పరిస్ధితుల్లో ఇతర పార్టీల పరిస్దితి ఎలా ఉన్నా ఏపీలో జనసేనకు చెందిన నేతలెవరూ అల్లు అర్జున్ పై ఇప్పటివరకూ బహిరంగంగా స్పందించలేదు. మెగా కుటుంబం మాత్రమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా మెగా సోదరుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇవాళ జనసేన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ ఎక్స్ లో స్పందించారు.

Govt job is to register a case and gather the information and submit the accused to the court and the Judge will decide and punish according to the facts on record..
— Bolisetty Satyanarayana (@bolisetti_satya) December 24, 2024
Hon'ble CM Of Telangana Mr Revanth Reddy is focussing only on @alluarjun and treating him as a murderer! CM of… pic.twitter.com/tLxvdviXMi
అల్లు అర్జున్ కేసుపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందిస్తూ.. కేసు నమోదు చేసి, సమాచారాన్ని సేకరించి, నిందితుడిని కోర్టుకు సమర్పించడం ప్రభుత్వ పని అని, ఆ తర్వాత న్యాయమూర్తి రికార్డులో ఉన్న వాస్తవాల ప్రకారం నిర్ణయించి శిక్షిస్తారన్నారు.కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ పై ఫోకస్ పెట్టారని, ఆయన్ను ఓ హంతకుడిగా పరిగణిస్తున్నారన్నారు.తెలంగాణా సిఎం తన రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతున్న 22 మరణాలపై దృష్టి పెట్టాలని బొలిశెట్టి కోరారు.
అలాగే అసెంబ్లీలో ఆ మరణాలపై చర్చించాలని బొలిశెట్టి సలహా ఇచ్చారు. తెలుగు ప్రజలకు, భారతీయ సినిమాకు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తిని సత్కరించే బదులు చిత్రహింసలు పెట్టి.. ఫోర్జరీ కేసు పెట్టి విచారణ అధికారులను తమ పని చేయకుండా తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారని విమర్శించారు. ఏపీలోనూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తన అధికారం దుర్వినియోగం చేశారని గుర్తుచేశారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, వారి పనులు, చేష్టల ప్రకారం బాధ పడక తప్పదన్నారు. జగన్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డికి కూడా తగిన శిక్ష పడుతుందని ముగించారు.












Click it and Unblock the Notifications