సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తండ్రి కన్నుమూత
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తండ్రి షణ్ముఖం మంగళవారం నాడు ఉదయం మరణించాడు. పలువురు ఆయనను పరామర్శించారు.
హైదరాబాద్: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తండ్రి షణ్ముఖం మంగళవారం నాడు ఉదయం మరణించారు.లక్ష్మీనారాయణ బంధుమిత్రులు , స్నేహితులు ఆయనను పరామర్శించారు.
సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ అందరికీ తెలిసినవారే. వైసిపి అధినేత జగన్ కేసును లక్ష్మీనారాయణ విచారించారు.అయితే కొంత కాలం క్రితం ఆయన మహరాష్ట్రకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణ హయాంలోనే వైసిపి అధినేత జగన్ అరెస్టు అయ్యారు.అయితే ఈ కేసులు ఇంకా కొనసాగుతున్నాయి.

అనారోగ్య కారణాలతో లక్ష్మీనారాయణ తండ్రి షణ్ముఖం మరణించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన సన్నిహితులు, బంధువులు ఆయనను పరామర్శించారు. బేగంపేటలోని శ్యామల బిల్డింగ్ లోని గోదావరి అపార్ట్ మెంట్ లోనే షణ్ముఖం చనిపోయారు.












Click it and Unblock the Notifications