బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!
జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. ఇప్పటి వరకు జీవన్ రెడ్డి చేరే పార్టీ పైన సస్పెన్స్ కొన సాగుతోంది. బీఆర్ఎస్.. బీజేపీ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్లు సిద్దంగా ఉన్నాయి. తన మద్దతుదారుల తో సమావేశం అయిన జీవన్ రెడ్డి తన ముందు ప్రత్యామ్నాయాల పైన వివరించారు. కార్యకర్తల సూచనతో ఏ పార్టీలో చేరాలో డిసైడ్ అయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. కాగా, ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు విసుగొచ్చిన రాష్ట్ర ప్రజలు మార్పు రావాలి.. రేవంత్ రెడ్డి పోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు ప్రాజెక్టుల నిర్వహణ ప్రధాన అంశమని తెలిపారు. తెలంగాణకు జీవనాడి ప్రాణహిత జలాలను వాడుకోవడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రానున్న రోజుల్లో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తల కోరిక మేరకే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేయటంతో పాటుగా కొత్త పార్టీలో చేరిక పైన తన మద్దతు దారులతో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తనకు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్ల గురించి వివరించారు.

కార్యకర్తలతో చర్చలు.. బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం
ఇదే సమయంలో కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేసారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని మెజార్టీ అభిప్రాయంగా వెల్లడైంది. తనకు బీఆర్ఎస్ లో చేరితో తగిన గుర్తింపు ఇస్తామంటూ ఇచ్చిన హామీ పైన జీవన్ రెడ్డి ముఖ్యులతో చర్చించారు. దీంతో, అందరూ అంగీకరించటంతో మద్దతు దారులతో కలిసి ఈ నెల 13న గులాబీ కండువా కప్పుకోవాలని జీవన్ రెడ్డి నిర్ణయించారు. ముందుగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరి ఆ తరువాత జగిత్యాలలో సభ ఏర్పాటు కు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. జీవన్ రెడ్డితో పాటుగా జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరుతారని చెబుతున్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డితో పాటుగా ముఖ్యులు ఎవరూ పార్టీ వీడకుండా మంత్రాంగం చేస్తున్నారు. దీంతో, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications