Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మునుగోడులో బీజేపీ కోసం రంగంలోకి జీవితా రాజశేఖర్; ఈటల రాజేందర్ సతీమణితో కలిసి ప్రచారం!!

తెలంగాణ రాష్ట్రంపై బలంగా ఫోకస్ చేస్తున్న బిజెపి ప్రస్తుతం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికపై ప్రధానంగా దృష్టిసారించింది. మునుగోడు ఉప ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం తహతహలాడుతున్న బిజెపికి, మునుగోడు ఉపఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించడం కోసం ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించిన బిజెపి, తమ పార్టీ నుండి సమర్థులైన నాయకులను, చరిష్మా ఉన్న నాయకులను ప్రచార పర్వం లోకి దింపనుంది.

మునుగోడులో వ్యూహాత్మకంగా బీజేపీ ప్రచారం

మునుగోడులో వ్యూహాత్మకంగా బీజేపీ ప్రచారం


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడు బాట పట్టించి ప్రచారం నిర్వహిస్తోంది. గ్రామ గ్రామాన ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఎన్నికల పోలింగ్ కు నెలరోజులు కూడా సమయం లేకపోవడంతో దూకుడు పెంచిన బిజెపి కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడానికి ఐదంచెల వ్యూహాన్ని రచించింది.

ఇందులో భాగంగా మునుగోడు ఉపఎన్నికలకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిన బిజెపి, మండల కమిటీలను, గ్రామ కమిటీలను, బూత్ లెవల్ కమిటీలను, పన్నా ప్రముఖ్ లను నియమించి ప్రణాళికాబద్దంగా మునుగోడులో ప్రచార బరిలోకి దిగింది.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి జీవితా రాజశేఖర్

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి జీవితా రాజశేఖర్


ఇక ఇదే సమయంలో చరిష్మా ఉన్న నాయకులతో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించిన బీజేపీ తెలుగు సినిమా రంగం నుండి బీజేపీలో కొనసాగుతున్న జీవిత రాజశేఖర్ ను ఎన్నికల ప్రచార బరిలోకి దింపేందుకు కాషాయ దళం సిద్ధమైంది. ఈ మేరకు మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి జీవితారాజశేఖర్ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. మరో రెండు మూడు రోజుల్లో జీవిత-రాజశేఖర్ మునుగోడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని బీజేపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

ఈటల రాజేందర్ సతీమణితో కలిసి జీవిత ప్రచారం

ఈటల రాజేందర్ సతీమణితో కలిసి జీవిత ప్రచారం


హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున తో కలిసి జీవిత రాజశేఖర్ ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. ఇటీవల బీజేపీలో చేరిన సినీనటి జీవిత రాజశేఖర్ కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ఫోన్ చేసి మునుగోడు లో ప్రచారం చేయాలని కోరగా, జీవిత రాజశేఖర్ అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బిజెపిలో యాక్టివ్ గా ఉన్న జీవిత రాజశేఖర్, వచ్చే ఎన్నికలలో ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని టాక్ నడుస్తున్న క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల ప్రచార పర్వానికి జీవిత రాజశేఖర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

జీవితా రాజశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రభావం ఎలా ఉంటుంది? ఆసక్తికర చర్చ

జీవితా రాజశేఖర్ ఎన్నికల ప్రచారం ప్రభావం ఎలా ఉంటుంది? ఆసక్తికర చర్చ


జీవిత రాజశేఖర్ ప్రచారం చేస్తే మునుగోడులో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీపై, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఇటీవల కాలంలో సంచలన ఆరోపణలు చేసిన జీవితారాజశేఖర్, మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రచార పర్వంలో టిఆర్ఎస్ పార్టీపై ఏవిధంగా విరుచుకుపడబోతున్నారు.జీవితా రాజశేఖర్ ప్రచార ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+