ఇదిగో రేవంత్ కులపిచ్చి, అందుకే ఓటుకు నోటులో సహకరించాం: మత్తయ్య సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆదివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

  Revanth Reddy Reached Vijayawada To Meet Chandrababu Naidu | Oneindia Telugu

  టీడీపీ-టీఆర్ఎస్ ఒప్పందం: రేవంత్ 'రాజీనామా' స్కెచ్, అందుకే బాబు మౌనం?

  ఓటుకు నోటు కోసం తమ జీవితాలు పణంగా పెట్టాడు

  ఓటుకు నోటు కోసం తమ జీవితాలు పణంగా పెట్టాడు

  ఓటుకు నోటు కేసులో తన స్వార్థ రాజకీయాల కోసం తమ జీవితాలను రేవంత్ రెడ్డి పణంగా పెట్టారని మత్తయ్య ఆరోపించారు. స్వార్థంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని అభిప్రాయపడ్డారు.

  అందుకే ఓటుకు నోటులో సహకరించాం

  అందుకే ఓటుకు నోటులో సహకరించాం

  బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రైస్తవులకు టీడీపీ అండగా ఉందన్న ఉద్దేశ్యంతో నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు సహకరించామని సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలుస్తోంది. దాని ఫలితంగా ఆయా పలువురి నుంచి నిందలు, అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.

  రెడ్లతో కలిసి రెడ్ల రాజ్యం కోసం, రేవంత్ కులపిచ్చి, అందుకే

  రెడ్లతో కలిసి రెడ్ల రాజ్యం కోసం, రేవంత్ కులపిచ్చి, అందుకే

  అధికార దాహంతో కొంతమంది రెడ్లతో కలిసి రెడ్డి రాజ్య స్థాపనకు రేవంత్ కంకణం కట్టుకున్నాడని మత్తయ్య విమర్శించారు. కులపిచ్చి ఉన్న రేవంత్ నాడు అదే సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసే ప్రయత్నంలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడన్నారు.

  రేవంత్ కుట్రలు ఆలస్యంగా గ్రహించాం

  రేవంత్ కుట్రలు ఆలస్యంగా గ్రహించాం

  అతని కుట్రలను ఆలస్యంగా గ్రహించామని, వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి దళిత క్రైస్తవుల అభ్యర్థులను రేవంత్‌కు పోటీగా నిలబెడతామన్నారు. రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని మత్తయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు రేవంత్‌కు తాము బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Jerusalem Mathaiah hot comments on Congress leader and Kodangal MLA Revanth Reddy.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి