ఉక్కు పరిశ్రమ: కెసిఆర్‌తో జిందాల్ సిఈఓ(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో గురువారం జిందాల్ కంపెనీ సిఇవో నీరజ్‌కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్‌కుమార్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సింగ్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జిందాల్ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉక్కు పరిశ్రమలో అపారఅనుభవం ఉన్న తమకు రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ స్థాపించే అవకాశం ఇవ్వాలని కోరారు. వరంగల్-ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సెయిల్ ముందుకు వస్తున్నదని, ఏదైనా కారణాల వల్ల సెయిల్ సకాలంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పకపోతే.. పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉండాలని సిఎం కేసీఆర్ జిందాల్ ప్రతినిధులకు సూచించారు.

రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, జిందాల్ కంపెనీలు అందులో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం శుభపరిణామమని సీఎం అన్నారు. తెలంగాణ మంచినీటి పథకానికి సంబంధించి జిందాల్ కంపెనీ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే నూతన పారిశ్రామిక విధానం ప్రారంభమవుతుందని, అప్పుడు ఆయా కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తికి చేస్తున్న ప్రయత్నాలు రెండేండ్లలో పూర్తిస్థాయిలో ఫలిస్తాయని సీఎం వెల్లడించారు.

హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ జరుగుతుందని, నగరశివార్లలో ఫార్మాసిటి, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కాబోతున్నాయని సీఎం వారికి తెలిపారు. ఐటీ పరిశ్రమ బాగా విస్తరిస్తున్నదని, ఏరోస్పేస్ పరిశ్రమలు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పారు. రాబోయే కొద్ది నెలలల్లోనే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపనకు అనేక కంపెనీలు ముందుకు రాబోతున్నాయని, వాటిలో జిందాల్ కంపెనీ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో గురువారం జిందాల్ కంపెనీ సిఇవో నీరజ్‌కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్‌కుమార్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సింగ్ భేటీ అయ్యారు.

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

ఈ సందర్భంగా జిందాల్ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే తమకు ఉక్కు పరిశ్రమల స్థాపనలో అనుభవం ఉందని, తెలంగాణలో ఉక్కు పరిశ్రమను స్థాపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని జిందాల్ ప్రతినిధులు వివరించారు.

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

కెసిఆర్‌తో జిందాల్ ప్రతినిధులు

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మంచినీటి పథకానికి అవసరమయ్యే పైపులను సరఫరా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. పైపుల తయారీ కేంద్రాన్ని కూడా తెలంగాణలోనే నెలకొల్పుతామని సీఎంకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+