JNTU Hyderabad: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు హైదరాబాద్ జేఎన్టీయూ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇంటర్మీడియెట్‌లో 90 శాతం మార్కులు సాధించిన విద్యార్థుల్లో కొందరు ఇంజినీరింగ్‌లో చేరాక మొదటి సంవత్సరంలోనే ఫెయిలవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జేఎన్‌టీయూ(JNTUH) హైదరాబాద్ అలాంటి విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోషన్ ఇచ్చేందుకు వీలుగా తొలి ఏడాది అకడమిక్ క్రెడిట్స్‌ను 75 శాతానికి తగ్గించింది.
మరోవైపు, ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)అధికారులు అయితే ఈ విద్యా సంవత్సరానికి ఏకంగా క్రెడిట్స్ వ్యవస్థనే తొలగించడం గమనార్హం. క్రెడిట్స్‌ను తగ్గించి విద్యార్థులకు ప్రమోషన్ ఇస్తున్నా.. వారికి మిగిలిన సెమిస్టర్లలో ఒత్తిడి పెరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వర్సిటీ అధికారులు మాత్రం, విభిన్న నేపథ్యాల నుంచి వస్తున్న విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు.

అయితే, ఇంజినీరింగ్ తొలి ఏడాదిలోనే వందల మంది ఉత్తీర్ణులు కాకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో తెలుగు మీడియం చదివిన వారిలో చాలామందికి ఒకేసారి ఇంగ్లీష్‌లో చదవాలంటే ఇబ్బంది కావడం, అలాగే అప్పటి వరకు గ్రామాల్లో చదువుకున్న వారు నగరాల పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నారు. దీంతో చదువులో కొంత వెనకబడిపోతున్నారు.
మరోవైపు, ఉస్మానియా, జేఎన్‌టీయూలలో సరైన సంఖ్యలో ప్రొఫెసర్లు లేకపోవడం, కొత్తగా వచ్చిన సైబర్ భద్రత, డేటాసైన్స్, కృత్రిమమేధ వంటి కోర్సులపై కొందరు ప్రొఫెసర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కొరవడటంతో కళాశాలల్లో బోధనా ప్రమాణాలు తగ్గిపోయి ఫెయిలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.
మరోవైపు, డిటెన్షన్ విధానంతో ఆ విద్యార్థుల్లో ఆత్మన్యూనత భావం కలుగుతోందని, క్రెడిట్స్ తగ్గింపు కేవలం ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమనే విషయాన్ని అందరూ గుర్తించాలని కెరీర్ కౌన్సిలర్ రాజశేఖర్ పేర్కొన్నారు. మరోవైపు, పాఠాలు అర్థం కావడంలేదని, ఫెయిలవుతున్నారని రెండో సంవత్సరానికి ప్రమోషన్ కోసం క్రెడిట్స్‌ను తగ్గించడం సరికాదని ఉస్మానియా మాజీ ఉపకులపతి రామచంద్రం అభిప్రాయపడ్డారు. అంతేగాక, బోధనా ప్రమాణాలు పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు.












Click it and Unblock the Notifications