వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కు షాక్: పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీకి సంయుక్త కమిటీ రిపోర్ట్; తెలంగాణాపై ఫైన్ కు సిఫార్సు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పై అక్టోబర్ 1వ తేదీ లోగా నివేదిక సమర్పించాలని చెన్నై జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్ర పర్యావరణ శాఖ నాన్చుడు ధోరణి పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఇంతకు ముందు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ జరిపిన విచారణలో సంయుక్త కమిటీ విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ తోపాటుగా కృష్ణానది యాజమాన్య బోర్డులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ జాతీయ హరిత ట్రిబ్యునల్ కు నివేదికను సమర్పించింది. ఈ నివేదికతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

తెలంగాణాకు జగన్ మార్క్ షాక్ .. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ఆపండి ; ఎన్జీటీలో అఫిడవిట్తెలంగాణాకు జగన్ మార్క్ షాక్ .. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ఆపండి ; ఎన్జీటీలో అఫిడవిట్

 తెలంగాణ రాష్ట్రానికి 3 కోట్ల 80 లక్షల రూపాయల జరిమానాకు సిఫార్సు

తెలంగాణ రాష్ట్రానికి 3 కోట్ల 80 లక్షల రూపాయల జరిమానాకు సిఫార్సు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలను చూస్తే తాగునీటి ప్రాజెక్టు అని చెప్పి సాగునీటి ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టారని సంయుక్త కమిటీ ధ్రువీకరించింది. తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు తెలంగాణ రాష్ట్రానికి 3 కోట్ల 80 లక్షల రూపాయల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించిన సంయుక్త కమిటీ

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించిన సంయుక్త కమిటీ

ఎన్జీటీ ఆదేశాల మేరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్వహిస్తున్న నార్లాపూర్, వట్టెం, కర్వేన, ఉదండాపూర్ రిజర్వాయర్ లను సందర్శించిన కమిటీ ఎలాంటి పర్యావరణ ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లుగా సంయుక్త కమిటీ గుర్తించింది. ప్రాజెక్టు ప్రారంభానికి 2017 లో పర్యావరణ అధ్యయన నివేదిక తయారీలో అనుమతుల కోసం కేంద్రానికి సమర్పించిన లేఖలో 60 రోజుల్లో 90 టీఎంసీలు వరద నీటిని తాగునీటి అవసరాలకు ఎత్తిపోతల మన తెలంగాణ పేర్కొందని కానీ తాగునీటి అవసరాలకు కేటాయిస్తుంది చాలా తక్కువని, సింహభాగం ఇరిగేషన్ అవసరాలకే తెలంగాణ వినియోగిస్తుందని నివేదికలో పేర్కొంది.

 60 రోజులకు 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్ధ్యం ఉన్న పంపులు

60 రోజులకు 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్ధ్యం ఉన్న పంపులు

ఇక్కడ పంపులు రోజుకు 2.07 టి.ఎం.సి ల నీటిని, 60 రోజులకు 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్ధ్యం ఉన్నాయని నివేదికలో పేర్కొంది. దీనికి అదనంగా డిండి ప్రాజెక్టు సమీపంలో 30 టీఎంసీల సామర్థ్యంతో కూడా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టినట్లు తమ పరిశీలనలో తేలిందని సంయుక్త కమిటీ నివేదించింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు కేవలం 7.15 టీఎంసీల నీరు త్రాగు నీటి అవసరాల నిమిత్తం సరిపోతుందని కమిటీ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా ముంపునకు గురయ్యే గ్రామాలు, తండాల వాసులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాసం కూడా కల్పించిందని కమిటీ పేర్కొంది.

కమిటీ నిర్ణయంతో విబేధించిన తెలంగాణా సభ్యులు

కమిటీ నిర్ణయంతో విబేధించిన తెలంగాణా సభ్యులు

అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని, రెండవ దశలో సాగునీటి అవసరాల కోసం పనులు చేపట్టనున్నామని అనుమతుల కోసం దరఖాస్తు చేశామని చెబుతున్నట్లుగా కమిటీ నివేదికలో పేర్కొంది. ఇక కమిటీలో ఉన్న ఇద్దరు తెలంగాణ సభ్యులు మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు, గనుల శాఖ సహాయ డైరెక్టర్ విజయరామరాజు కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని విభేదించారు. తాగునీటి అవసరాలకు మాత్రమే పనులు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.

తాగునీటి అవసరాల పేరుతో సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం

తాగునీటి అవసరాల పేరుతో సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం

2017 లో కేంద్రానికి రాసిన లేఖ ప్రకారం ప్రాజెక్టు ముందస్తు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాల్సి ఉండగా, దానికి భిన్నంగా పూర్తిస్థాయి పనులు జరుగుతున్నాయని సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. తాగునీటి అవసరాల నిమిత్తం 90 టీఎంసీలు సామర్థ్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు చేపడుతున్నట్లు తెలంగాణ పేర్కొన్నప్పటికీ, ఇందులో తాగునీటి అవసరాలు 7.15 టీఎంసీలు మాత్రమేనని నివేదికలో పేర్కొంది.
1916 రోజులపాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగాయని పేర్కొంది. దెబ్బతిన్న పర్యావరణ పునరుద్ధరణలో భాగంగా సిఫార్సుల అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ద్వారా స్పష్టం చేసింది.

పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీకి ఏపీ సర్కార్, ఏపీ రైతులు

పాలమూరు రంగారెడ్డిపై ఎన్జీటీకి ఏపీ సర్కార్, ఏపీ రైతులు


గతంలో పాలమూరు-రంగారెడ్డి నీటి కేటాయింపులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం సాగునీటి పనులు చేపట్టిందని ఏపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు రైతులు జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యవహారంలో విచారణ జరిగిన సమయంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు పర్యావరణ హాని జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అక్రమ నిర్మాణం అని, తాగునీటి ప్రాజెక్టు ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్టు ను నిర్మిస్తున్నారని,ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో అఫిడవిట్ దాఖలు చేసింది.

 పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని స్పష్టం ..తెలంగాణాకు సంయుక్త కమిటీ షాక్

పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని స్పష్టం ..తెలంగాణాకు సంయుక్త కమిటీ షాక్

ఇక తాజాగా సంయుక్త కమిటీ ఇచ్చిన నివేదికలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని పర్యావరణ నష్టపరిహారం కింద తెలంగాణ ప్రభుత్వానికి మూడు కోట్ల 80 లక్షల రూపాయల జరిమానా విధించేలా సంయుక్త కమిటీ సిఫార్సు చేసింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెలికెలు పెడుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణాకు పెద్ద దెబ్బ తగిలింది. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా కారణమైంది. సంయుక్త కమిటీ నివేదిక కెసిఆర్ సర్కార్ కు షాక్ ఇవ్వగా , మరి ఈ వ్యవహారంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ తుది తీర్పు పై ఉత్కంఠ నెలకొంది.

English summary
joint committee of Palamuru Rangareddy submitted a report to the NGT. It recommended a fine of Rs 3 crore 80 lakh to Telangana for violating the rules by claiming that it was a drinking water project and undertaking work as an irrigation project..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X