NTR: ఎన్టీఆర్‍కు నివాళులు అర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..
ఇవాళ విశ్వవిఖ్యాత మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని హైదరాబాద్ లో నిర్వహించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఆయనకు నివాళులర్పించారు. ఈ తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ సమాధి వద్దకు వచ్చిన ఇద్దరు సోదరులు.. పుష్పగుచ్ఛాలు ఉంచి తమ తాతను గుర్తు చేసుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్
తాత ఎన్టీఆర్‌ను తలచుకుని జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు వారి కోసం ఎన్టీఆర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు నందమూరి అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.
బాలకృష్ణ
బాలకృష్ణ కూడా తండ్రికి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని బాలకృష్ణ చెప్పారు. టీడీపీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని గుర్తు చేశారు.

పటేల్, పట్వరీ
ఎన్టీఆర్ తెలుగు తెరను మకుటం లేని మహారాజు ఎలారు. ఏ పాత్రనైనా అలవోకగా చేసి తెలుగు ప్రజల గుండెళ్లో నిలిచారు. ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా,నిర్మాతగా, స్టూడియో అధినేతగా,రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించారు. ఆ తర్వాత టీడీపీ పార్టీని స్థాపించి తెలుగు సత్తాను దేశానికి చాటారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. పటేల్, పట్వరీ వ్యవస్థను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకుక అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications