ఏం చేయలేకపోయా, రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా అని బాధపడ్డా: జూపల్లి
హైదరాబాద్: తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ప్రజలకు ఏమీ చేయలేకపోయానని, అప్పుడు తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని బాధపడ్డానని మంత్రి జుపల్లి కృష్ణా రావు బుధవారం నాడు వ్యాఖ్యానించారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. బుధవారం నాడు ఎంపీపీల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలే అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. వాటిని ప్రజలలోకి తీసుకు వెళ్లవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులదే అన్నారు.

ఎంపీపీల వేతనాన్ని రూ.1500 నుంచి రూ.10వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుదే అన్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా మండల, జిల్లా పరిషత్‌లకు నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications