వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ఇన్పోసిస్ లో ఉద్యోగాల కోత లేదు, కొత్తగా 20 వేల మందికి జాబ్స్

ఐటీ ఉద్యోగులకు శుభవార్తే. తమ కంపెనీ భారీగా ఉద్యోగులను తీసివేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇన్పోసిస్ సిఇఓ ప్రవీణ్ రావు ప్రకటించారు.కొత్తగా 20 వేల మందికి ఉద్యోగాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింద

By Narsimha
|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పుల కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకొంటున్నాయి. అంతేకాదు పింక్ స్లిప్ లను ఉద్యోగులకు ఇస్తున్నారు. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది .

తమ ఉద్యోగాల రక్షణ కోసం యూనియన్లను కూడ ఏర్పాటుచేసుకొన్నారు సాఫ్ట్ వేర్ రంగ ఉద్యోగులు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సాఫ్ట్ వేర్ ఉద్యోగులన్నీ యూనియన్లను ఏర్పాటు చేసుకోనే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడ టెక్కీలకు ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. అయితే కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేసేవారికి ఇబ్బందులు ఉండవనే భరోసాను ఇస్తోంది. అయితే ఇదే తరుణంలో ఇన్పోసిస్ కూడ శుభవార్తను చెప్పింది.

టెక్కీలకు శుభవార్త

టెక్కీలకు శుభవార్త

ఇన్సోసిస్ నుండి ఉద్యోగులను తీసివేయడం లేదని ఆ సంస్థ సిఈఓ యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. ఇన్పోసిస్ నుండి బారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్టుగా వార్తలను ఆయన ఖండించారు.పనితీరు బాగాలేని 300 నుండి 400 మంది ఉద్యోగులను మాత్రమే తప్పుకోవాలని కోరినట్టు చెప్పారు.ఈ స్థఆయిలో తొలగింపులు ప్రతి ఏటా ఉంటాయని ఆయన చెప్పారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.పనితీరు సక్రమంగా లేని ఉద్యోగుల తొలగింపు సాధారణమేనని చెప్పారు.

కొత్తగా 20వేల మందికి ఉద్యోగాలు

కొత్తగా 20వేల మందికి ఉద్యోగాలు

ఈ ఏడాది కొత్తగా ఇన్పోసిస్ లో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు.ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లోనే సగంమందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు చెప్పారు ప్రవీణ్ రావు.కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్పోసిస్ తాజా ప్రకటన ఐటీ ఉద్యోగుల్లో శుభవార్తే.

ఐటీ కంటే ఇతర ఉద్యోగాలే బెస్ట్

ఐటీ కంటే ఇతర ఉద్యోగాలే బెస్ట్

లాజిస్టిక్స్, రవానా, బ్యూటీ అండ్ ఫిటినెస్, రియల్ ఎస్టేట్ , ఉద్యోగాల కల్పన జరగనున్నట్టు అసోచామ్ తెలిపింది.రానున్న రోజుల్లో ఐటీ ఉద్యోగాల విషయాల్లో ఇబ్బందే కలుగుతోందని సర్వే ప్రకటించింది.గత మూడేళ్ళలో కేవలం 10 లక్షలమందికి మాత్రమే ఉపాధి అవకాశాలను కల్పించింది ఐటీ రంగం.2022 నాటికి మరో 10 లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పించనుంది ఐటీరంగం.రానున్న రోజుల్లో ఐటీ కంటే ఇతర రంగాలను ఎంచుకోవడమే మేలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి సర్వేలు.

సాప్ట్ వేర్ రంగం మందగమనం

సాప్ట్ వేర్ రంగం మందగమనం

సాఫ్ట్ వేర్ రంగం మందగమనంలో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు సాఫ్ట్ వేర్ రంగంపై తీవ్రం చూపిస్తున్నాయి. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు, స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించేలా చట్టాల్లో మార్పులు చేయడంతో భారత్ ఆధారిత సాఫ్ట్ వేర్ కంపెనీలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.ఈ కారణంగానే వీసాలను గణనీయంగా తగ్గించుకొన్నాయి. ఆయా కంపెనీల ఆధాయం కూడ గణనీయంగా తగ్గింది.

English summary
It is a sigh of big relief for the majority of Infosys employees as Indian IT giant Infosys has made an official statement about the rumors of ongoing layoffs. Company Chief Operating Officer UB Pravin Rao and Infosys co-chairman Ravi Venkatesan met the IT Minister Ravi Shankar Prasad in Delhi recently and revealed before the media that the company has only performed a regular performance-based layoff where in just 300-400 number of employees were asked to leave. Several news popped out spreading fears among people working in IT industry in the recent past.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X