కాచిగూడ రైల్వే స్టేషన్ కు మహార్దశ.. కొత్త హంగులతో లైటింగ్ సిస్టమ్..
హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక కట్టడాల్లో ఒకటైన కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కొత్త విద్యుత్ దీపాలంకరణ ప్రారంభం అయింది. న్యూ లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. రూ. 2.23 కోట్ల వ్యయంతో ఈ దీపాలంకరణ పూర్తయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సగటున రోజుకు 50,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు.
హైదరాబాద్ కు తలమానికంగా ఉన్న కాచిగూడ రైల్వే స్టేషన్ లో నూతన లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రారంభించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రధాన ముఖద్వారానికి ఏర్పాటు చేసిన కొత్త విద్యుత్ దీపాలంకరణను ఈ మేరకు జాతికి అంకితం చేశారు. తాను గతంలో పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు కాచిగూడ స్టేషన్ విద్యుత్ దీపాలంకరణ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని గుర్తు చేశారు. రూ. 2.23 కోట్ల అంచనా వ్యయంతో ఈ దీపాలంకరణ పూర్తయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కాచిగూడ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని.. 775 ఆధునిక ఎల్ఈడీ లైటింగ్ పరికరాలను ఉపయోగించి ఎంట్రాన్స్ లో విద్యుత్ దీపాలంకరణ చేశామని మంత్రి వివరించారు. సగటున రోజుకు 50,000 మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను సందర్శిస్తున్నారని ఆయన తెలిపారు.
అనేక అవార్డులు..
కాచిగూడ స్టేషన్ భారతీయ రైల్వేలో నంబర్ వన్ ఇంధన సామర్థ్య స్టేషన్‌గా అనేక అవార్డులు అందుకుందని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, ఇంధన పొదుపు కోసం కాచిగూడ స్టేషన్‌లో 400 కేడబ్ల్యూపీ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్ల పనులు పూర్తయ్యాయని, వీటిని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించారని పేర్కొన్నారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టామని.. పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఎం. అనిల్ కుమార్ యాదవ్, శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఇతర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications