నీ చిల్లర చేష్టల రికార్డులన్నీ నా దగ్గరున్నాయ్: ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి షాకిచ్చారుగా!!
మాజీ మంత్రి కడియం శ్రీహరిపై, మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి 361 మంది నక్సలైట్లను హతమార్చారని, తనకు అడ్డు వచ్చిన వారిని ఎన్కౌంటర్లు చేసేవారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం తన అడ్డా అని, అక్కడ వేరే వారిని కాలు పెట్టనివ్వనని శపథం చేశారు. ఇక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కడియం శ్రీహరి తనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని అసహనం వ్యక్తం చేశారు.
Recommended Video

నియోజకవర్గంలో సర్వే చేయిద్దాం: కడియం శ్రీహరి సవాల్
మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యే రాజయ్యకు సవాల్ విసిరారు. స్టేషన్ ఘనపూర్‌లో పార్టీతో సంబంధం లేకుండా సర్వే చేద్దాం. ఎవరికి ప్రజలు మద్దతు ఇస్తే వారిదే స్టేషన్ ఘన్పూర్ అడ్డా తేల్చి చెప్పారు. నా సవాల్‌కు రాజయ్య సిద్ధమా! రాజయ్య నాసవాల్ కు సూటిగా సమాధానం చెప్పాలి! అని ప్రశ్నించారు. నిజమైన ప్రజా నాయకుడెవరో తేల్చుకుందామా అని నిలదీశారు. తాటికొండ రాజయ్య తన సవాల్‌ను స్వీకరించకపోతే తన గురించి మాట్లాడొద్దు అంటూ మండిపడ్డారు. పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే దానికి కట్టుబడే పనిచేస్తానని కడియం శ్రీహరి తేల్చిచెప్పారు. ఇంతవరకు నీతి తప్పని నేతగా ఉన్నానని చెప్పుకున్న కడియం శ్రీహరి రాజయ్య వ్యవహారం పార్టీ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు.

రాజయ్య చిలిపిచేష్టల రికార్డులు తన దగ్గర ఉన్నాయన్న కడియం శ్రీహరి
అంతేకాదు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య మధ్యాహ్నమే తాగి, చిలిపి చేష్టలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే రాజయ్య బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాకు పార్టీ నియమావళి అడ్డొస్తోంది. నేను మాట్లాడాలంటే కేసీఆర్ అడ్డొస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. రాజయ్య వ్యవహారాలన్నీ నాదగ్గర రికార్డు అయి ఉన్నాయి. రాజయ్య చిలిపిచేష్టల రికార్డులు తన దగ్గర ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రికార్డులు బయటపెడితే రాజయ్య ప్రజల్లో తిరగలేరు
తాను రాజయ్య రికార్డులు బయటపెడితే రాజయ్య ప్రజల్లో తిరగలేరు అంటూ కడియం శ్రీహరి హెచ్చరించారు. తనకు సంస్కారం అడ్డొస్తోందని పేర్కొన్నారు. దళితబంధు ఇస్తానని దావతులు చేసుకుంటున్నాడు అంటూ మండిపడ్డారు. ఒకవేళ రాకపోతే పేదల పరిస్థితి ఏంటీ అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరంటే పేరు చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది అంటూ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాజకీయాల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది
రాజకీయాల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కౌంటర్ చేశారు. రాజయ్య తన వ్యాఖ్యలను ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలి కానీ ఇలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. నాలుగు సార్లు గెలిచి నియోజకవర్గానికి ఏం చేసావ్ అని ప్రశ్నించారు. మతిస్థిమితం లేకుండా తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications