అలా అయితేనే ఆంధ్ర పాలకుల కుట్రలు సాగవు: కల్వకుంట్ల కవిత

కరీంనగర్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పినట్లుగా రాజకీయంగా తెలంగాణ బలంగా ఉంటేనే ఆంధ్ర పాలకుల కుట్రలు సాగవని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బుధవారంనాడు ఆమె మాట్లాడారు.

అందరినీ కలుపుకొని తెలంగాణను బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. గులాబీ కండువే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని చెప్పారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కాంగ్రెస్‌ను పలువురు వీడుతున్నారని తెలిపారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Kalvakuntla Kavitha says Andhra rulers efforts to shoud be defeated

సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలు పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. రైతులకు రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే సీఎం లక్ష్యమని చెప్పారు. ఆంధ్రా పాలకుల పాలనలో కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలియకుండా ఉండేదని గుర్తు చేశారు.

వచ్చే సీజన్‌లో రైతులకు 9 గంటల విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+