బహ్రెయిన్ మరో తెలంగాణ: కార్మికులతో కలిసి కవిత భోజనం(పిక్చర్స్)
బహ్రెయిన్: తెలంగాణకు అవతల ఉన్న మరో తెలంగాణే.. బహ్రెయిన్ అని, గల్ఫ్ కష్టాలులేని తెలంగాణ రాష్ట్రం సాధించాలన్నదే తమ ప్రయత్నమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి బహ్రెయిన్ శాఖ, తెలంగాణ సాంస్కృతిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లోని ఇండియన్ స్కూల్ మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గల్ఫ్‌లోని ఒక్కో దేశంలో ఒక్కోరకం సమస్య ఉన్నప్పటికీ, గల్ఫ్ కష్టాలన్నీ తీవ్రమైనవని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లో తెలంగాణ బిడ్డలతో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బహిరంగసభకు తెలంగాణవాదులు వేలాదిగా హాజరయ్యారు.
మధ్యాహ్నం లేబర్‌క్యాంపుల్లో ఉన్నవారిని కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్‌లో ఉన్నందున తెలంగాణలోని సొంత ఊర్లల్లో రేషన్‌కార్డుల నుంచి తమ పేర్లను తొలగిస్తున్నారని, తొలగించకుండా చూడాలని వలస కార్మికులు కోరారు.
కాగా, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని కవిత హామీ ఇచ్చారు.
అనంతరం గల్ఫ్ వలస కార్మికులతో కలిసి లేబర్ క్యాంపులో సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ హరిప్రసాద్, సామ రాజారెడ్డి, శ్రీనివాస్, వెంకటస్వామి, దాసరి మురళి తదితరులు పాల్గొన్నారు.

ఎంపి కవిత
తెలంగాణకు అవతల ఉన్న మరో తెలంగాణే.. బహ్రెయిన్ అని, గల్ఫ్ కష్టాలులేని తెలంగాణ రాష్ట్రం సాధించాలన్నదే తమ ప్రయత్నమని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు.

ఎంపి కవిత
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి బహ్రెయిన్ శాఖ, తెలంగాణ సాంస్కృతిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లోని ఇండియన్ స్కూల్ మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఎంపి కవిత
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గల్ఫ్‌లోని ఒక్కో దేశంలో ఒక్కోరకం సమస్య ఉన్నప్పటికీ, గల్ఫ్ కష్టాలన్నీ తీవ్రమైనవని పేర్కొన్నారు.

ఎంపి కవిత
బహ్రెయిన్‌లో తెలంగాణ బిడ్డలతో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బహిరంగసభకు తెలంగాణవాదులు వేలాదిగా హాజరయ్యారు.

ఎంపి కవిత
అంతకుముందు ఉదయం బహ్రెయిన్‌లోని తెలంగాణ జాగృతి నాయకులు సీహెచ్ హరిప్రసాద్ నివాసంలో అల్పాహారం తీసుకున్నారు.

ఎంపి కవిత
మధ్యాహ్నం లేబర్‌క్యాంపుల్లో ఉన్నవారిని కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఎంపి కవిత
ఈ సందర్భంగా గల్ఫ్‌లో ఉన్నందున తెలంగాణలోని సొంత ఊర్లల్లో రేషన్‌కార్డుల నుంచి తమ పేర్లను తొలగిస్తున్నారని, తొలగించకుండా చూడాలని వలస కార్మికులు కోరారు. కాగా, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తామని కవిత హామీ ఇచ్చారు.

ఎంపి కవిత
అనంతరం గల్ఫ్ వలస కార్మికులతో కలిసి లేబర్ క్యాంపులో సహపంక్తి భోజనం చేశారు.

ఎంపి కవిత
ఈ కార్యక్రమంలో సిహెచ్ హరిప్రసాద్, సామ రాజారెడ్డి, శ్రీనివాస్, వెంకటస్వామి, దాసరి మురళి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications