అమెరికాకు సిగ్గుచేటు: వెంకయ్య, టెక్కీ ఫ్యామిలీకి సుష్మా ఫోన్
కన్సాస్ కాల్పుల ఘటన పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి జాతి వివక్ష దాడులు సిగ్గుచేటు అన్నారు.
హైదరాబాద్: కన్సాస్ కాల్పుల ఘటన పైన కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి జాతి వివక్ష దాడులు సిగ్గుచేటు అన్నారు.
కన్సాస్ కాల్పులు, కూచిభోట్ల శ్రీనివాస్ మృతి పైన అమెరికా సమాధానం చెప్పాలని వెంకయ్య డిమాండ్ చేశారు. ఇలాంటి తీరు అమెరికాకు, ప్రపంచానికి కూడా మంచిది కాదని చెప్పారు.
అమెరికా ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశం అని వెంకయ్య నాయుడు అన్నారు. అలాంటి దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావొద్దని అభిప్రాయపడ్డారు.

శ్రీనివాస్ కుటుంబంతో మాట్లాడిన సుష్మా
కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కాన్సాస్ కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. శ్రీనివాస్ మృతదేహం సోమవారం హైదరాబాద్ వచ్చే అవకాశముంది.
అమెరికాతో మాట్లాడాలి: రఘువీరా
కన్సాస్ కాల్పులు, శ్రీనివాస్ మృతి పైన ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. ఇలాంటి దాడులు సరికాదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో మాట్లాడాలని సూచించారు.
ట్రంప్‌ను కలిసిన భారత రాయబారి
అమెరికాలో భారతీయల రాయబారి నవ్‌తేజ్ సర్నా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. కేవలం మర్యాదపూర్వకంగా ఆయన ట్రంప్‌ను కలిశారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఒక అత్యున్నత భారతీయ అధికారి ట్రంప్‌ను కలవడం ఇదే ప్రథమం.
1980 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందిన సర్నా అధ్యక్ష ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అమెరికా చేరుకున్నారు. అప్పటి వరకు ఆయన యూకేలో భారతీయ హైకమిషనర్‌గా పని చేశారు.
మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు నిన్న రాయబారులు అందరూ ట్రంప్‌తో భేటీ అయ్యారు. వీరిలో సర్నా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ అందరితో విడివిడిగా ఫొటోలు దిగారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications