జానీ మాస్టర్ పై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డికి డిమాండ్!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక యువతి పైన అత్యాచార ఘటనకు పాల్పడడం ప్రస్తుతం సినీవర్గాలలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది .జానీ మాస్టర్ పైన ఓ యువతి అత్యాచార కేసు పెట్టిన క్రమంలో జానీ మాస్టర్ గురించి అనేక అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా దీనిని లవ్ జిహాద్ గా పలువురు అభివర్ణిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ఘటన పైన సీనియర్ నటీమణి కరాటే కళ్యాణి స్పందించింది.

ఇది లవ్ జీహాద్ అన్న కరాటే కళ్యాణి
ఈ ఘటన పైన మాట్లాడిన కరాటే కళ్యాణి ఈరోజు ఎక్కడ చూసినా జానీ మాస్టర్ హిందూ అమ్మాయి పైన అత్యాచారం చేశారు, చెయ్యబోయారు, చాలా చాలా హింసించారు, చిత్రహింసలకు గురి చేస్తూ మతం మారి పెళ్లి చేసుకోవాలి అని వేధించారు అన్న కోణంలో ఆయన గురించి అనేక విషయాలు విన్నామని పేర్కొన్నారు. ఇది కచ్చితంగా లవ్ జిహాద్ నే అని కరాటే కళ్యాణి అభిప్రాయపడ్డారు.

Karate Kalyani sensational comments on Jani Master Demand to CM Revanth Reddy

మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణం
అసలు హిందూ అమ్మాయి పైన జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడడం దుశ్చర్య అన్న కరాటే కళ్యాణి పక్క రాష్ట్రంలో ఓ పార్టీకి చెందిన నేతగా ఉన్న జానీ మాస్టర్ గతంలో మతమార్పిడుల విషయంలో గట్టిగా ప్రచారం చేశారని, ఆంధ్ర ప్రాంతంలో క్రిస్టియన్స్ మతమార్పిడులు చేస్తున్నారని అప్పట్లో మాట్లాడిన, వ్యతిరేకించిన జానీ మాస్టర్ ఇప్పుడు ఒక అమ్మాయిని మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడం దారుణం అంటూ పేర్కొన్నారు.

జానీ మాస్టర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు
జానీ మాస్టర్ ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన, ఒక పెద్ద డాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన ఆయన ఏం చేసినా మనం మద్దతుగా ఉండాల్సిన అవసరం లేదని కరాటే కళ్యాణి అభిప్రాయం వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ ఆ అమ్మాయిని వేధించిన తీరు, ఆ అమ్మాయి చెబుతున్న తన పరిస్థితిని అర్థం చేసుకొని అందరూ బాధితురాలికి న్యాయం జరిగే వరకు, బాధితురాలికి మద్దతుగా ఉండాలని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి సర్కార్ కు కరాటే కళ్యాణి డిమాండ్
తాను కూడా బాధితురాలికి మద్దతు ప్రకటిస్తున్నానని జానీ మాస్టర్ వంటి వాళ్లను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేయాలని కరాటే కళ్యాణి అభిప్రాయం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాటం చేయాల్సిన సమయం ఇది అని ఆమె అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి మతమార్పిడులను ఏమాత్రం ప్రోత్సహించకుండా ఇలాంటి వాళ్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు.

కేసును లోతుగా దర్యాప్తు చెయ్యాలి
అయితే ఈ కేసు విషయంలో మరేదైనా రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా అనే విషయాన్ని కూడా ఎంక్వయిరీ చేయాలని ఈ మేరకు విచారణ చేపట్టాలని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+