శ్రుతి చనిపోవడం బాధాకరం: కల్వకుంట్ల కవిత, మోడీపై ఫైర్

వరంగల్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రుతి ఎన్‌కౌంటర్‌లో మరణించడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వరంగల్ ఎన్‌కౌంటర్ దురదృష్టకరమని కూడా ఆమె అన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె బుధవారం వరంగల్ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు.

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చేపట్టి చలో అసెంబ్లీ సందర్బంగా జరిగిన అరెస్టులపై కూడా ఆమె స్పందించారు. ప్రజా ఉద్యమాలను గౌరవిస్తామని ఆమె చెప్పారు. హైదరాబాద్ అరెస్టులను తాత్కాలిక కోణంలోనే చూడాలని అన్నారు. హైదరాబాద్‌లో చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టు చేసినవారందరనీ విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kavitha expressed sadness with the death of Shruthi in an encounter

పనిలో పనిగా ఆమె ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీది కార్పొరేట్ ప్రభుత్వమని విమర్శించారు. పసుపు రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. త్వరలో జరుగబోయే వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామన్నారు.

తెలుగుదేశం పార్టీలో జైలుకు వెళ్లిన వారికే టికెట్లు ఇస్తున్నారని అన్నారు. టిడిపిలో పదవుల్లో చోటులేదనే ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి దాడి చేయించాడని మండిపడ్డారు. ఇక్కడ ధర్నాలు చేయిస్తున్న వామపక్షాల నేతలు ఆంధ్రాలో ఎందుకు ధర్నాలు చేయడంలేదని నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+