బాకీ కింద వేలానికి కావూరి స్థలం: ముందుకు రాని బిడ్డర్లు
హైదరాబాద్: యుపిఎ హయాంలో కేంద్రమంత్రిగా ఉండి, ప్రస్తుతం బిజెపి నేతగా ఉన్న కావూరి సాంబశివరావుకు చెందిన హైదరాబాదులోని స్థలం వేలానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

కావూరికి చెందిన ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్స్' సంస్థ రూ.12 కోట్ల మేర వాణిజ్యపన్ను బకాయి పడటంతో నగరంలోని ఆయన స్థలాన్ని బుధవారం బహిరంగ వేలానికి పెట్టారు. ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో పురాతన భవనం ఉన్న 1160 గజాల విక్రయానికి కోర్టు అనుమతితో ప్రకటన ఇచ్చారు.
ఇక్కడ ప్రస్తుతం గజం రూ. 35-40 వేలు ఉండగా, వాణిజ్య పన్నులశాఖ ఏకంగా రూ.లక్షతో మొదలు పెట్టడంతో బిడ్డర్లు ముందుకు రాలేదు. ధర తగ్గిస్తే వేలంలో పాల్గొంటామన్న వినతులతో మరోసారి వేలం నిర్వహిస్తామని అధికారులు వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications