వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ కు మరో కీలక టాస్క్ అప్పగించిన కేసీఆర్ ... రంగంలోకి దిగిన కేటీఆర్

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ తన తనయుడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ముందు మరో కీలక టాస్క్ ఉంచారు. కేసీఆర్ కుమారుడిగా పార్టీలో అడుగుపెట్టిన కేటీఆర్ ను నాయకుడిగా మలిచే క్రమంలో ఆయనపై పలు కీలక బాధ్యతలు పెడుతున్నారు సీఎం కేసీఆర్. ఇక తండ్రి చూపిన మార్గంలో కేటీఆర్ సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. గతంలో బల్దియా ఎన్నికలు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న కేటీఆర్ పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక కుమారుడు కేటీఆర్ కృషికి మెచ్చుకుని పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవిని కట్టబెట్టిన కేసీఆర్ ప్రస్తుతం కేటీఆర్ భుజస్కంధాలపై చాలా కీలకమైన బాధ్యతలు పెట్టారు.

పార్లమెంట్ ఎన్నికల బాధ్యత ను కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికల బాధ్యత ను కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పచెప్పిన బాధ్యతను ఛాలెంజ్ గా తీసుకున్న కేటీఆర్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇంతకీ సీఎం కేసీఆర్ కేటీఆర్ పై పెట్టిన బాధ్యత ఏంటి అంటే రానున్న లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలవడం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలలో ఒక సీటును మిత్రపక్షం అయిన మజ్లిస్ పార్టీకి వదిలేసినా మిగిలిన 16 స్థానాల్ని గెలవాలని భావించిన కేసీఆర్ ఆ భాద్యతను కేటీఆర్ పై పెట్టారు. కేటీఆర్ కూడా దాన్ని ఛాలెంజింగా తీసుకుని పని మొదలుపెట్టాడు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయాలని ప్రయత్నిస్తున్న కేటీఆర్ జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించారు.

 రంగంలోకి దిగిన కేటీఆర్ .. 16 నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు

రంగంలోకి దిగిన కేటీఆర్ .. 16 నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు

రానున్న ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సర్వేలు జరిపిన కేసీఆర్ కొన్ని చోట్ల అభ్యర్థులు, ఎమ్మెల్యేల మధ్య గొడవలు, లోకల్ లీడర్ల నడుమ సమన్వయం లేకపోవడం లాంటి సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలని తనయుడు కేటీఆర్ కు సూచించారు.
దీంతో రంగంలోకి దిగిన కేటీఆర్ మార్చి 1 నుండి 11 వరకు 16 నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటిలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మండలి సభ్యులు, పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు ఇలా అన్ని స్థాయిల నేతలు పాల్గొననున్నారు.

వ్యూహాత్మకంగా అడుగులు .. ఈ టాస్క్ లో కేటీఆర్ సక్సెస్ అవుతారా ?

వ్యూహాత్మకంగా అడుగులు .. ఈ టాస్క్ లో కేటీఆర్ సక్సెస్ అవుతారా ?

ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల సన్నాహక సమావేశాలలో పార్టీ కీలక నాయకులతో చర్చించి కేటీఆర్ ప్రణాళికలు సిద్దం చేయనున్నారు. మరి ఇప్పటి వరకు అన్ని భాద్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించిన కేటీఆర్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తారో. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ భావిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం టిఆర్ఎస్ పార్టీకి సాధ్యమవుతుందా? కేటీఆర్ ఆ దిశగా సక్సెస్ అవుతారా? ఎంతో నమ్మకంతో తండ్రి తనపై పెట్టిన బాధ్యతను తన రాజకీయ చతురతతో నెరవేరేలా చేస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం.

English summary
Telangana CM KCR has been given a big responsibility to the party working president KTR. KCR suggested to KTR that the 16 seats in Lok Sabha elections will have to be won.KTR is involved in the assignment of KCR and started the plan of action . He is going to conduct the preparatory meetings of parliament elections .The meetings will be held in 16 constituencies from March 1 to 11th .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X