కేసీఆర్.. దమ్ముంటే నాతో రాజకీయం చెయ్: భగీరథ్ ర్యాగింగ్ ఎపిసోడ్‌పై భగ్గుమన్న బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలలో చక్రం తిప్పడానికి నేడు బిఆర్ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మం వేదికగా నిర్వహించనున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ఇదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కెసిఆర్ సభ పైన, వివిధ రాష్ట్రాల సీఎంలను పిలిచి కెసిఆర్ చేస్తున్న ఆర్భాటాల పైన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు.

 బండి సంజయ్ కుమారుడు భగీరధ్ ర్యాగింగ్ వీడియో

బండి సంజయ్ కుమారుడు భగీరధ్ ర్యాగింగ్ వీడియో

ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో తన తోటి విద్యార్థి పై దాడి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో బాధితుడిపై భగీరథ్ అసభ్య పదజాలంతో దూషించాడు. అతనితోపాటు అతని స్నేహితులు కూడా బాధిత విద్యార్థిని చితకబాదారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలు తనను ఎవరూ ఏమీ చెయ్యలేరని వ్యాఖ్యలు చేస్తూ బెదిరించడంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది.

బండి సంజయ్ కుమారుడు భగీరధ్ పై కేసు నమోదు

బండి సంజయ్ కుమారుడు భగీరధ్ పై కేసు నమోదు

ఇక పోలీసు ఉన్నతాధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇది మాత్రమే కాదు గతంలో బండి సంజయ్ కుమారుడు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో కూడా ఇలాగే గొడవలుకు దిగినట్టుగా సమాచారం. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్పుడు కూడా అతనిపై చర్యలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తన కొడుకుపై కేసు రాజకీయాల నుండి డైవర్ట్ చెయ్యటానికే : బండి సంజయ్

తన కొడుకుపై కేసు రాజకీయాల నుండి డైవర్ట్ చెయ్యటానికే : బండి సంజయ్

ఇదిలా ఉంటే తన కుమారుడిపై ర్యాగింగ్ కేసు నమోదు చేయడం పట్ల బండి సంజయ్ స్పందించారు. తన కొడుకు పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని పిల్లల జీవితాలతో ఎలా ఆడుకుంటారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయాల నుంచి దృష్టి మళ్లించడం కోసమే ఈ వీడియోని వైరల్ చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. అంతేకానీ పిల్లల్ని రాజకీయాల మధ్యలోకి తీసుకురావద్దని బండి సంజయ్ హితవు పలికారు. పిల్లలు పిల్లలు కొట్టుకుంటారు కలుస్తారు.. దీనికింత రాద్దాంతం చేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆర్ మనవడి విషయంలో కొందరు కామెంట్స్ చేస్తే తాను ఖండించానన్న బండి

కేసీఆర్ మనవడి విషయంలో కొందరు కామెంట్స్ చేస్తే తాను ఖండించానన్న బండి


తన కొడుకు మందు కోసం ఖాజాగుడాలో గొడవ చేయలేదని, ఒకవేళ అలా చేస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారా.. ప్రాసెస్ ఆలో అయ్యారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇదంతా కావాలని చేస్తున్న రాజకీయమని బండి సంజయ్ ఆరోపించారు. కెసిఆర్ మనవడు హిమాన్షు విషయంలో కొందరు కామెంట్ చేస్తే తాను ఖండించినట్టు బండి సంజయ్ గుర్తు చేశారు. కెసిఆర్ పాపం పండిందని బండి సంజయ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తప్పు చేసి ఉంటే తానే జైలుకు తీసుకొచ్చి అప్పగిస్తానని బండి సంజయ్ తేల్చి చెప్పారు. తన కుమారుడిని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా.. అంటూ బండి సంజయ్ పోలీసులను నిలదీశారు. తనతో రాజకీయం చేయడం చేతకాక తన కుమారుడిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటూ బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+