వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనలో కేసీఆర్ చిచ్చు..! గబ్బర్ సింగ్ ను కలవరపెడుతున్న గులాబీ నేత..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : హోరా హోరీగా జ‌రిగిన తెలంగాణ‌లో ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చింద‌న్న చందంగా తెలంగాణలో గులాబీ పార్టీ గెలుపు ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న ఏపి రాజ‌కీయ నాయకుల‌కు గులాబీ బాస్ తీసుకున్న నిర్ణ‌యం వారు వ్య‌క్తం చేసిన హ‌ర్షాన్ని ఆవిరి చేస్తోంది. ఏపి ఎన్నిక‌ల ప్ర‌చారంలో తాము త‌ప్ప‌కుండా పాల్గొంటామ‌ని చెప్పిన గులాబీ బాస్ ఎవ‌ర‌కి మ‌ద్ద‌త్తుగా ప్ర‌చారం చేస్తోరోన‌న్న అంశం ప‌ట్ల ఆస‌క్తి నెల‌కొంది. గ‌తంలో చంద్ర‌శేఖ‌ర్ రావుకు సంఘీభావం ప్ర‌క‌టించిన నాయ‌కులు ఇప్పుడు ఆయ‌న వైఖ‌రి ప‌ట్ల సందిగ్దంలో ప‌డిపోయారు. ఏపిలో ప‌ర్య‌టిస్తామ‌ని అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ చెప్పుకొస్తున్న‌ప్ప‌టికి ఎవ‌రికి అనుకూలంగా ఉంటార‌నేది ఉత్కంఠ‌గా మారింది. ఇంత‌కీ అంద‌రిని టెన్ష‌న్ పెట్టే పవన్ కళ్యాణ్ కేసీఆర్ అంశంలో ఎందుకు ఉత్కంఠతకు లోనౌతున్నట్టు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!

 ఏపిలో పర్యటిస్థామన్న గులాబీ బాస్..! కలవరపడుతున్న రాజకీయ పార్టీలు..!!

ఏపిలో పర్యటిస్థామన్న గులాబీ బాస్..! కలవరపడుతున్న రాజకీయ పార్టీలు..!!

ముఖ్యంగా ఏపిలో అదికార తెలుగుదేశం పార్టీని ప‌క్క‌న పెడితే ప్ర‌తిప‌క్ష వైసీపి, జ‌న‌సేన పార్టీలు ఇదే అంశంలో కంటిమీద కునుకు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌శేఖ‌ర్ రావుకు ఏదో రూపంలో అనుకూలంగా మాట్లాడిన ఈ ఇరు పార్టీల అధినేత‌లు ఇప్పుడు కేసీఆర్ మ‌ద్ద‌త్తు అంశంలో టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ మ‌ద్య‌నే ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావును వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకోవ‌డ‌మే కాకుండా ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీకి సంఘీభావం తెలిపిన జ‌న‌సేన అదినేత అదినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం అంద‌రి కంటే ఎక్కువ ఉత్కంఠ‌త‌కు లోన‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఏపిలో ఎవరికి మద్దత్తిస్తారు..! కేసీఆర్ తీరుపై ఉత్కంఠ..!!

ఏపిలో ఎవరికి మద్దత్తిస్తారు..! కేసీఆర్ తీరుపై ఉత్కంఠ..!!

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీసుకున్న ఓ నిర్ణయం జనసేన, వైసీపి పార్టీ వర్గాలను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని కలవరపెడుతోందట. తెలంగాణలో విజయకేతనం ఎగరవేసిన కేసీఆర్, మరికొద్ది రోజుల్లో ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెట్టబోతున్నారనే వార్తల పట్ల విస్త్రుత ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ ఎవరికి మద్దతిస్తారనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల్లో కూడా అంతే స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీకలిసి వస్తే ముఖ్యమంత్రిని అవుతానంటూ పవన్ వ్యక్తీకరిస్తున్న మనో ధైర్యం దెబ్బతీసేలా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది.

 టీఆర్ఎస్ పార్టీకి మద్దత్తు తెలిపిన ఏపీ పార్టీలు..! ఇప్పుడు ఎవరికి మద్దత్తో ఇంకా చెప్పని కేసీఆర్..!!

టీఆర్ఎస్ పార్టీకి మద్దత్తు తెలిపిన ఏపీ పార్టీలు..! ఇప్పుడు ఎవరికి మద్దత్తో ఇంకా చెప్పని కేసీఆర్..!!

అంతకుముందు తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయని సంగతి తెలిసిందే. ఎన్నికల పై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని పేర్కొన్న పవన్ తాము బరి లో దిగడం లేదని, సమర్థులైన నేతని ఎన్నుకోవాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. అయితే అంతర్గతంగా జనసేన పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని పార్టీ వర్గాలకు, సానుభూతిపరులకు సూచించినట్లు వారు తగు విధంగా నడుచుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు అందరిచూపు ఏపీలో కేసీఆర్ పోషించే పాత్రపై కేంద్రీక్రుతమై ఉంది. సహజంగానే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల్లో ఏ పార్టీకి కేసీఆర్ మద్దతు ఇవ్వబోతున్నారనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.

జగన్ కే కేసీఆర్ మద్దత్తు..! షాక్ లో గబ్బర్ సింగ్...!!

జగన్ కే కేసీఆర్ మద్దత్తు..! షాక్ లో గబ్బర్ సింగ్...!!

టీడీపీ అధినేత చంద్రబాబు విధానాలను ప్రశ్నిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లలో ఎవరికి గులాబీ దళపతి మద్దతు ఇవ్వనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో, కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కే మద్దతివ్వాలని తెలంగాణ సీఎం నిర్ణయించుకున్నట్లు వినిపిస్తున్న సమాచారం జనసేన వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఒకవేళ టీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ప్రచారం నిజమైతే, జనసేన పార్టీకి భారీ షాక్ తిన్నట్లేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాని చంద్రశేఖర్ రావుతో సన్నిహిత సంభందాలు నెరపుతున్న పవన్ కు ఎలాంటి హామీ చేయరనే చర్చ కూడా జరుగుతోంది.

English summary
The information disclosing that the Telangana CM has decided that his support for YCP chief YS Jagan for next general elections in AP. If the campaign on the decision taken by the TRS is true, the Jana Sena party is a huge shock, says political analysts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X