• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు బాటలో కేసీఆర్: కేంద్రంపై యుద్ధం; పీకే వ్యూహం బూమరాంగ్ కాదు కదా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు బాటలో పయనిస్తున్నారా? గతంలో అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేసిన విధంగానే కెసిఆర్ కూడా ఇప్పుడు పోరాటం చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రతిపక్ష పాత్ర కూడా ఆయనే పోషిస్తున్నారా? కేంద్రంలోని బీజేపీతో తలపడటానికి కేసిఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం వెనుక పీకే వ్యూహం ఉందా? ఇది కేసీఆర్ కు లాభం చేకూరుస్తుందా లేకా బూమరాంగ్ అవుతుందా? అన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

 చంద్రబాబు తరహాలో మోడీపై యుద్ధానికి దిగిన కేసీఆర్

చంద్రబాబు తరహాలో మోడీపై యుద్ధానికి దిగిన కేసీఆర్

2019 ఎన్నికలకు ముందు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాటం అంటూ యుద్ధం ప్రకటించి పోరు బాట పట్టారు. బీజేపీయేతర శక్తులన్నింటినీ ఏకం చేయడానికి గత ఎన్నికలకు ముందు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేశారు. మోడీ పై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు గత ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల మాటటుంచి రాష్ట్రంలోనే చావు దెబ్బ తిని అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ ధాన్యం కొనుగోలు కోసం మోడీ సర్కార్ పై పోరుబాట పట్టారు. చంద్రబాబు తరహాలో ఓటమి పాలు కాకుండా ఉండడానికి తెలంగాణ సామాజిక పరిస్థితిని, తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ కేంద్రంపై యుద్ధానికి దిగారు.

కేసీఆర్ వ్యూహాత్మక పోరాటం... అధికారంలో ఉంది ప్రతిపక్షంలా ఆందోళనలు

కేసీఆర్ వ్యూహాత్మక పోరాటం... అధికారంలో ఉంది ప్రతిపక్షంలా ఆందోళనలు


పంజాబ్ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, దేశంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని, బీసీ జనాభా గణన అంశాన్ని, ఎస్టీల రిజర్వేషన్లు అంశాన్ని, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని , ఇలా అనేక అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ వ్యూహాత్మక పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో 95 నుండి 105 స్థానాలు దక్కించుకోవడం కోసం పీకే సూచనల మేరకు అధికార పార్టీలో ఉండి, ప్రతిపక్ష నేతల మాదిరిగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.

 పీకే రోడ్ మ్యాప్.. వ్యూహాత్మక ఎత్తుగడలతో కేంద్రాన్ని టార్గెట్

పీకే రోడ్ మ్యాప్.. వ్యూహాత్మక ఎత్తుగడలతో కేంద్రాన్ని టార్గెట్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రోడ్ మ్యాప్ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తున్నా, ఇంకా కొన్ని విషయాల్లో తెలంగాణ వెనకబడటం వెనుక కేంద్ర వైఖరి ప్రధాన కారణమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కెసిఆర్. బీసీలను, ఎస్సీ, ఎస్టీలను తమవైపు తిప్పుకోవడం కోసం కెసిఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు సీఎం అయిన కేసీఆర్ మూడోసారి ముచ్చటగా సీఎం కావడానికి ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. వ్యూహాత్మక ఎత్తుగడ తో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు.

బాబు తరహాలోనే పోరాటం... కానీ ఫెయిల్ కాకుండా జాగ్రత్తలు .. సక్సెస్ అవుతారా?

బాబు తరహాలోనే పోరాటం... కానీ ఫెయిల్ కాకుండా జాగ్రత్తలు .. సక్సెస్ అవుతారా?

కేంద్ర పరిపాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రజలను తయారుచేస్తే మళ్లీ అధికారం తమ హస్తగతం అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను నిర్వహించిన పీకే సొంత పార్టీలోనే ప్రజాప్రతినిధుల వైఫల్యాలను చెప్పడంతోపాటు, ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టేలా అనేక అస్త్రశస్త్రాలను కేసీఆర్ కు అందించినట్లు సమాచారం. ఏది ఏమైనా గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే కేంద్రం పై ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారో, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రయత్నం చేశారో, ప్రస్తుతం అదే తరహాలో సీఎం కేసీఆర్ కూడా ప్రయత్నిస్తూ ఉండటం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ పీకే ఇచ్చిన రోడ్ మ్యాప్ కెసిఆర్ కు లాభం చేకూరుస్తుందో లేక బూమరాంగ్ అవుతుందో వేచి చూడాలి.

English summary
KCR is doing what Chandrababu did before the elections in the past. The debate in Telangana now is whether the PK strategy will work out for coming to power again or it will be a boomerang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X