Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారిది మహిళల పట్ల కపట ప్రేమ.. జాగ్రత్త: వైఎస్ షర్మిల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కూడా వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆడవాళ్ల పట్ల వారిది కపట ప్రేమ.. జాగ్రత్త అని వైఎస్ షర్మిల హెచ్చరించారు.

తెలంగాణా: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఏ మాత్రం అవకాశం దొరికినా తెలంగాణ సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను, కల్వకుంట్ల కుటుంబాన్ని తిట్టిపోసే పనిలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పాటు, వచ్చే ఎన్నికలలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి వైయస్సార్ తెలంగాణ పార్టీని ఆదరించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

మహిళా దినోత్సవం నాడు వదిలిపెట్టని షర్మిల

మహిళా దినోత్సవం నాడు వదిలిపెట్టని షర్మిల

ఇప్పటికే ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన వైఎస్ షర్మిల ఎక్కడికి వెళ్లినా స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి, వారి అవినీతిని బయటపెట్టి రచ్చ చేశారు. రాష్ట్రంలో సందర్భం ఏదైనా, ఆయా సందర్భాలలో ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టడంలో వైయస్ షర్మిలది గణనీయమైన పాత్ర. ఇక తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా కూడా వైయస్ షర్మిల తనదైన శైలిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు

సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు

ఎన్నికల ఏడాదిలో మహిళా దినోత్సవం రాగానే మహిళలు యాదికొచ్చారు దొరకు అంటూ మండిపడిన వైఎస్ షర్మిల మహిళల పట్ల కెసిఆర్ సర్కార్ చిన్నచూపు చూస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి, మూడేండ్లుగా దాదాపు 4వేల కోట్ల బకాయిలు చెల్లించలేదు అని షర్మిల మండిపడ్డారు.

రాష్ట్రంలోని 46.10లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కెసిఆర్ మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు పట్టుమని 750కోట్లు ఇచ్చి, మహిళల పట్ల మరోసారి కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముక్కుపిండి బకాయిలు వసూలు చేయించాలని కేటీఆర్ కు విజ్ఞప్తి

ముక్కుపిండి బకాయిలు వసూలు చేయించాలని కేటీఆర్ కు విజ్ఞప్తి

అంతేకాదు కెసిఆర్ తీరుతో మహిళలే ఆపసోపాలు పడి, బ్యాంకర్లకు వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి వచ్చిందని వైయస్ షర్మిల విమర్శించారు. మహిళల పట్ల కెసిఆర్ కు నిజంగానే ప్రేమ ఉంటే 4000 కోట్ల బకాయిలు చెల్లించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 750 కోట్లకు చిన్న దొర కృతజ్ఞత చెప్పడం మానేసి వీలైతే కేసిఆర్ ముక్కుపిండి బకాయిలు వసూలు చేయించాలని వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

కేసీఆర్ ను ఒక్కడినే తిడితే సరిపోదు అంటున్న వైఎస్ షర్మిల

కేసీఆర్ ను ఒక్కడినే తిడితే సరిపోదు అంటున్న వైఎస్ షర్మిల

ఇక అంతకుముందు కెసిఆర్ ను తిడితే ఓట్లు పడవు అని మంత్రి పేర్కొన్న ఒక పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేసిన వైఎస్ షర్మిల అవును.. కెసిఆర్ ఒక్కడినే తిడితే సరిపోదు.. ఆయనతోపాటు అమ్ముడుపోయిన ప్రజాప్రతినిధులను తిట్టాలి అంటూ పేర్కొన్నారు.

ఇక ప్రశ్నించాల్సింది పోయి డప్పు కొడుతున్న పత్రికలను, అణచివేయబడుతున్నా ఆదమరచి నిద్రపోతున్న మేధావులను, తిరగబడకుండా తాగి తందనాలాడుతున్న భజన బృందాలను, నా దాకా రాలేదు కదా అని నానబెడుతున్న నాయకులను జనం తిట్టడం ఆపి తరిమేదాకా తెచ్చుకోక ముందే మేలుకుంటే మంచిది అంటూ వైఎస్ షర్మిల ట్విట్టర్ లో ఘాటుగా పోస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+