• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు.!అర్వింద్ పై దాడికి మూల్యం తప్పదన్న బండి సంజయ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎంపీ ధర్మపురి అరవింద్ పై పోలీసుల కనుసన్నల్లో టీఆర్ఎస్ గుండాలు దాడి చేశారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.
డీజీపీ మహేందర్ రెడ్డి ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయరని, ప్రభుత్వం ఆయనకు ఫోన్ ఎందుకు ఇచ్చిందో అర్ధం కావడంలేదని మండిపడ్డారు. పార్లమెంట్ సభ్యుడి పై దాడి జరిగిందంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు సంజయ్. ఎంపీ అరవింద్ పై దాడిని పార్టీ ఉపాద్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర స్థాయిలో ఖండించారు.

ఎంపీ అరవింద్ పై జరిగిన దాడి అమానుషం.. సీఎం స్పందించాలన్న బండి సంజయ్

ఎంపీ అరవింద్ పై జరిగిన దాడి అమానుషం.. సీఎం స్పందించాలన్న బండి సంజయ్

ఎంపీ ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడి పట్ల ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని, ఎంపీ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య బాధాకరమని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇంకా ఎంతమందిని బలితీసుకుంటారోనని ఆవేదన వ్యక్తం చేసారు బండి సంజయ్. 317 జీవో తో ఉద్యోగులు ఆందోళనలతో, భాదతో చనిపోతున్నారని, ఫామ్ హౌస్ నుండి 7సంవత్సరాలుగా బయటకురాని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావని ఎద్దేవా చేసారు బండి సంజయ్.

సీఎం స్కామ్ ల పై కేంద్రం ద్రుష్టి పెట్టింది.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్న బండి

సీఎం స్కామ్ ల పై కేంద్రం ద్రుష్టి పెట్టింది.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్న బండి

అంతే కాకుండా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి దిక్కుతోచడంలేదని, మొదటి తెలంగాణ ద్రోహి చంద్రశేఖర్ రావేనని, కనీసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఓటింగ్ లో కూడా పాల్గొనలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్కామ్ ల పై కేంద్రం ద్రుష్టి పెట్టిందని, జైలు జీవితం చంద్రశేఖర్ రావుకి తప్పదని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసారు. చంద్రశేఖర్ రావు కేంద్ర నిధులను దారి మళ్లించాడని, కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను దమ్ముంటే ప్రజల మద్య పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

దాడులకు బిజెపి భయపడే ప్రసక్తే లేదు.. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న డీకే అరుణ

దాడులకు బిజెపి భయపడే ప్రసక్తే లేదు.. టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న డీకే అరుణ

నిజామాబాద్ జిల్లా ఇస్సాపల్లి లో పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురితో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికె అరుణ తెలిపారు. కారు అద్దాలు పగలగొట్టి దాడిచేయడం హత్యాయత్నానికి పాల్పడిన టిఆర్ఎస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. పోలీసు యంత్రాంగం సాక్షిగా దాడి జరగడం దారుణమని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలపై టీఆర్ఎస్ దాడులను ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు డీకే అరుణ. దాడులతో బిజెపి కార్యకర్తలను నాయకులను భయపెట్టాలని టిఆర్ఎస్ అధినేత భావిస్తే మరింత ఉదృతంగా కార్యకర్తలు టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని, ఇలాంటి దాడులకు బిజెపి భయపడే ప్రసక్తే లేదన్నారు డీకె అరుణ.

నిజాంను తరిమికొట్టిన తెలంగాణ సమాజం.. కెసిఆర్ ను కూడా తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్న రాజాసింగ్

నిజాంను తరిమికొట్టిన తెలంగాణ సమాజం.. కెసిఆర్ ను కూడా తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్న రాజాసింగ్

ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి టిఆర్ఎస్ పార్టీ అధినేత ఇతర పార్టీల నేతలను భయపెట్టాలని చూస్తున్నారని బిజెపి శాసనసభా పక్ష నాయకులు రాజా సింగ్ స్పష్టం చేసారు. ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, టిఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలు నిత్యకృత్యమయ్యాయని రాజాసింగ్ మండిపడ్డారు. దాడులు టిఆర్ఎస్ కార్యకర్తలు చేస్తే బిజెపి కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని, దాడుల వెనుక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుట్ర ఉందనేది స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రాజకీయంగా బిజెపిని ఎదుర్కోలేక పోలీసులతో కేసులు నమోదు చేయించి జైలుకు పంపించడం ద్వారా కక్ష సాధింపు చర్యల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాజాసింగ్ అన్నారు.

English summary
Bandi Sanjay demanded that the Chief Minister respond immediately to the attack on MP Dharmapuri Arvind and severely punish those who attacked the MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X