హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రైస్తవ భవన్‌కు కెసిఆర్ శంకుస్థాపన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం మహేంద్రాహిల్స్‌లో నిర్మించనున్న క్రైస్తవ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి ఆనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. క్రైస్తవ భవనం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించామని, అందులో భవన నిర్మాణం చేపడతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దేనికీ ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. వచ్చే సంవత్సరం క్రిస్‌మస్ వేడుకలను ఇక్కడ నిర్మించబోయే భవనంలో జరుపుకుందామన్నారు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని,మాట ఇచ్చిన ప్రతీది చేసి చూపిస్తామని తెలిపారు. జనవరి నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను వేగవంతం చేస్తామని తెలిపారు.

ఆయన వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టి.రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, మంత్రులు టి.పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న, ఫాదర్ తుమ్మబాల, జిహెచ్‌ఎంసి ప్రత్యేక అధికారి సోమేష్‌కుమార్, ఐఎఎస్ అధికారి రేమాండ్ పీటర్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సంజీవయ్య, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుతో పాటు పలువురు క్రైస్తవ మతపెద్దలు, ఉన్నతాధికారులు, నాయకులు గజ్జెల నాగేష్ తదితరులు పాల్గోన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

మంగళవారం మహేంద్రాహిల్స్‌లో నిర్మించనున్న క్రైస్తవ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

కెసిఆర్

కెసిఆర్


ముందుగా భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి ఆనంతరం రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులతో కలసి శంకుస్థాపన చేశారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. క్రైస్తవ భవనం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించామని, అందులో భవన నిర్మాణం చేపడతామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు దేనికీ ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. వచ్చే సంవత్సరం క్రిస్‌మస్ వేడుకలను ఇక్కడ నిర్మించబోయే భవనంలో జరుపుకుందామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని,మాట ఇచ్చిన ప్రతీది చేసి చూపిస్తామని తెలిపారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Tuesday laid foundation stone for Christian Bhavan at Mahendra Hills in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X