జైలుకు పంపిస్తా.. దమ్ముంటే రా, బాబుని పరుగెత్తించా: కేసీఆర్ (వీడియో)
హైదరాబాద్: తెలంగాణ - మహారాష్ట్రల మధ్య రెండు రోజుల క్రితం చారిత్రక ఒప్పందం జరిగింది. ప్రాజెక్టుల పైన 'మహా' ఒప్పందంపై కాంగ్రెస్ సహా విపక్షాలు దుమ్మెత్తి పోశాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత కౌంటర్ ఇచ్చారు.
'మహా' ఒప్పందంపై కాంగ్రెస్, టిడిపి తదితర పార్టీలు భగ్గుమనగా, తెరాస కౌంటర్ ఇస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించింది.
మహారాష్ట్రతో ఒప్పందం అనంతరం బుధవారం నాడు కేసీఆర్ హైదరాబాద్ వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పైన, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
ఉత్తమ్ - కేసీఆర్‌ల మధ్య వాగ్యుద్ధం నడిచింది. కేసీఆర్ బుధవారం మాట్లాడుతూ... కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ కాళ్లు కడుగుతానని, ఎవరు అడ్డు వచ్చినా అన్ని శక్తులను ఎదుర్కొంటానని, తెలంగాణకు నీరు తెస్తానని చెప్పి తెచ్చానని అన్నారు.
మహారాష్ట్రతో ఒప్పందం తెలంగాణకు వరప్రదాయిని అని, గోదావరి మిగులు జలాల్లో రాష్ట్రవాటా సాధిస్తామని కేసీఆర్ ఉద్వేగంగా చెప్పారు. చారిత్రక ఒప్పందాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలు, ఉత్తమ్ పైన మండిపడ్డారు. నేను ఇంటికి వెళ్తానో, మీరు జైలుకు వెళ్తారో చూద్దామన్నారు.
ఉత్తమ్‌కు దమ్ముంటే ఒప్పంద పత్రంతో బయటకు రావాలని డిమాండ్ చేశారు. నేను ఇటు నుంచి రాజ్ భవన్ వెళ్లి రాజీనామా చేస్తానని, ఆరోపణలు రుజువు చేయాలన్నారు. లేదంటే కేసులు పెడతానని హెచ్చరించారు.
దానికి ఉత్తమ్ కూడా ధీటుగానే స్పందించారు. తాను సైన్యంలో పని చేశానని, దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడి వచ్చానని, కేసీఆర్ బెదిరింపులకు తాను భయపడనని కౌంటర్ ఇచ్చారు. ముమ్మాటికి తెలంగాణ భవిష్యత్తును కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లకు తమ హయాంలో సూత్రప్రాయ ఒప్పందం జరిగిందన్నారు.

మీ హయాంలో 152 మీటర్లకు ఒప్పందం కుదిరిందా
తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్లకు ఒప్పందం కుదిరిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి చెప్పుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు.

జైలు కూడు తినాల్సిందే
ఆధారాల్లేకుండా మాట్లాడితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని, అక్కడ జైలు కూడు తినాల్సి వస్తుందని కేసీఆర్ హెచ్చరించారు.

త్వరలో ఓ టీవీ ఛానల్ ముందుకు వస్తా
త్వరలోనే ఒక చానల్‌లో కూర్చొని మూడు నాలుగు గంటలపాటు కాంగ్రెస్ నేతల బండారాన్ని బయటపెడతానని హెచ్చరించారు.

తెలివి ఉండాలి
పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి కూడా ఒక అంతు ఉండాలని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజకీయం మాట్లాడినా దానికి అవసరమైన కనీస పరిజ్ఞానం, తెలివి ఉండాలన్నారు.

ఏం మాట్లాడారని ఆగ్రహం
మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఈ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి.. ఇద్దరు కలిసి ఏం మాట్లాడారని మండిపడ్డారు.

ఇక్కడే ఉంటా, దమ్ముంటే రండి
152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరిందని మాట్లాడారని, నిజాయితీ ఉన్నవాళ్లే అయితే నేను బేగంపేట ఎయిర్‌పోర్టులో ఇంకో అర్ధగంట, నలభై నిమిషాలు ఉంటానని, దమ్ముంటే.. ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట విమానాశ్రయానికి రావాలని, అదే నిజమైతే ఇక్కడ్నుంచి నేను ఇంటికి వెళ్లనని, రాజ్ భవన్‌కు పోయి గవర్నర్‌కు నా రాజీనామా సమర్పిస్తానని సవాల్ చేశారు. జీవితంలో రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.

మీ డ్రామాలు
మల్లన్నసాగర్ వద్ద భూములు సేకరిస్తుంటే మీ డ్రామాలు ప్రజలు చూస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఎంత నాశనం అయిందో అందరికీ తెలుసునన్నారు. మీరు పదవులలో కులుకుతూ, పైరవీలు జేసుకుంటూ తెలంగాణను సర్వనాశనం చేయలేదా అని ప్రశ్నించారు.

సమాధానం చెప్పండి
మీ కాంగ్రెస్ పార్టీ, మీ తర్వాత పద్దెనిమిదేళ్లు పాలించిన టిడిపిని.. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నానని, మీరు మనుషులే అయితే, మీకు పౌరుషం ఉంటే, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు.

చంద్రబాబును పరుగెత్తించి..
2001లో గులాబీ జెండా ఎగిరేవరకు మహబూబ్‌నగర్ జూరాల ప్రాజెక్టు కట్టినా.. నీళ్లు నింపుకోలేని పరిస్థితి అని, కర్ణాటక రాష్ట్రానికి కాంపన్షేషన్ పే చెయ్యాలని, గులాబీ జెండా ఎగిరిన తర్వాత మేం దాడి ప్రారంభిస్తే మోకాళ్ల మీద పరుగెత్తి చంద్రబాబు పరిహారం ఇచ్చాడన్నారు.

2001లో గులాబీ జెండా ఎగిరేవరకు మహబూబ్‌నగర్ జూరాల ప్రాజెక్టు కట్టినా.. నీళ్లు నింపుకోలేని పరిస్థితి అని, కర్ణాటక రాష్ట్రానికి కాంపన్షేషన్ పే చెయ్యాలని, గులాబీ జెండా ఎగిరిన తర్వాత మేం దాడి ప్రారంభిస్తే మోకాళ్ల మీద పరుగెత్తి చంద్రబాబు పరిహారం ఇచ్చాడన్నారు.
నాగార్జున్‌సాగర్.. ఒకటే ప్రాజెక్టు అని, కుడి కాలువ మీద లిఫ్ట్‌లుంటాయని, ఎడమ కాలువ మీద లిఫ్టులుంటాయని, కుడికాలువ లిఫ్టులకు అప్పటి ఏపీ గవర్నమెంటే బిల్లు కడితే, తెలంగాణకు పారే ఎడమ కాలువ లిఫ్ట్‌కు మాత్రం రైతులు బిల్లు కట్టుకోవాలా అని ప్రశ్నించారు.

గులాబీ జెండా ఎగిరిన తర్వాతే
గులాబీ జెండా ఎగిరిన తర్వాతనే.. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద జీవోలు ఇష్యూ జేసి, ఎడమకాలువ బిల్లు కూడా ఆనాటి ప్రభుత్వం మెడలు వంచి కట్టించింది తమ పార్టీయే అన్నారు. అప్పటిదాకా మీరెందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications