కేసీఆర్ ‘బీఆర్ఎస్’కు ముహూర్తం ఫిక్స్: టీఆర్ఎస్ పరిస్థితేంటి? కీలక ప్రతిపాదనలివే!

హైదరాబాద్: జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా పార్టీని స్థాపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఈ పార్టీకి భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అనే పేరును కూడా ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో అప్‌డేట్ బయటికొచ్చింది.

కేసీఆర్ బీఆర్ఎస్‌కు ముహూర్తం ఖరారు?

కేసీఆర్ బీఆర్ఎస్‌కు ముహూర్తం ఖరారు?

కేసీఆర్ తన జాతీయ పార్టీని ప్రకటించేందుకు తేదీని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. జూన్ 19, 20 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పార్టీ అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ నేతలతో చర్చలు జరిపిన అనంతరం ఈ తేదీని కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక పలు ప్రతిపాదనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్-టీఆర్ఎస్ కీలక ప్రతిపాదనలివే?

బీఆర్ఎస్-టీఆర్ఎస్ కీలక ప్రతిపాదనలివే?

ఆ ప్రతిపాదనల విషయానికొస్తే.. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పరిస్థితిపై చర్చించారు. కొత్త జాతీయ పార్టీకి ఏ గుర్తు అనేదానిపై చర్చించారు. కారు గుర్తునే కొనసాగించాలని, అలాగే పార్టీ జెండా రంగును కూడా గులాబీగానే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, పార్టీ జెండాలో తెలంగాణ మ్యాప్ నకు బదులు భారతదేశ మ్యాప్ ఉండేలా నిర్ణయించినట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ?

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ?

అంతేగాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ కొనసాగించాలని, ఆ తర్వాత టీఆర్ఎస్‌ను బీఎర్ఎస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఏయే రాష్ట్రాల్లో పోటీ చేయాలి? ఏయే పార్టీలతో కలిసి పోటీ చేయాలనేదానిపైనా చర్చించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉండటంతో కసరత్తులు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితేంటి?

ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితేంటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీకి ఎవరు ప్రాతినిథ్యం వహిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. మరికొంత మంది నేతలతో కూడా కేసీఆర్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో ప్రధానంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. మరి తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్, ఆయన జాతీయ పార్టీకి ఆదరణ ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం సవాలే?

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం సవాలే?

కాగా, టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ కోసం అన్నట్లుగా ఉన్న పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ చేయడం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయనేదానిపైనా కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల్లోకి బలంగా వెళ్లిన టీఆర్ఎస్‌ను.. ఇప్పుడు బీఆర్ఎస్ గా పరిచయం చేయడం ఆ పార్టీ నేతలకు సవాలుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కాగా, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌లో విలీనం చేస్తారా? లేక టీఆర్ఎస్‌నే బీఆర్ఎస్‌గా మార్చేస్తారా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

    Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu OneIndia
    బీఆర్ఎస్.. దేశంలో మరో జాతీయ పార్టీ?

    బీఆర్ఎస్.. దేశంలో మరో జాతీయ పార్టీ?

    సార్వత్రికి ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉండటంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చర్చలను కొనసాగిస్తున్నారు కేసీఆర్. జాతీయ పార్టీపై రాష్ట్ర కమిటీ తీర్మానాన్ని ఈసీకి పంపనున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చేందుకు ఈసీని సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. కాగా, అన్ని అనుకున్నట్లు జరిగితే.. త్వరలోనే దేశంలో మరో జాతీయ పార్టీ అవతరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+