కేసీఆర్ పక్కా స్కెచ్.. కన్నడ రాజకీయాల్లో దుమారం!
రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేతలు కొందరే ఉంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా అదే కోవలోకి వస్తారు. చర్చలు జరపడానికి బెంగళూరు నుంచి వచ్చిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామికి జడ్‌ప్లస్ కేటగిరిలో భద్రత కల్పించారు. కర్ణాటకలో ఇది పెద్ద వార్తగా మారింది. కన్నడ నాట మొత్తం ఈ టాపిక్ మీదే వార్త నడుస్తోంది.
భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలను ఏకం చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఇప్పుడు కుమారస్వామితో చర్చలు జరిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అర్దరాత్రి 12.15 గంటలకు ఆయన వచ్చారు. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం కుమారస్వామికి జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది.

విమానాశ్రయం నుంచి ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ చేరుకున్న కుమారస్వామి రాత్రికి అక్కడే స్టే చేశారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత బెంగళూరుకు తిరుగుపయనమయ్యారు. అప్పటివరకు ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కొనసాగింది. దేవగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి ఎక్కడికి వెళ్లినా సాదాసీదాగా ఉంటారు. కానీ హైదరాబాద్‌లో ఆయనకు Z+ కేటగిరిలో భద్రత ఏర్పాటు చేయడం వెనక కేసీఆర్ రాజకీయ వ్యూహం దాగివుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications