అబద్దాల కంపెనీ ఓనర్ కేసీఆర్.. త్వరలోనే కేసీఆర్ రాజకీయభవిష్యత్ ముగింపు: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నిప్పులు చెరిగారు. కెసిఆర్ అబద్ధాల కంపెనీ ఓనర్ అంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పై కెసిఆర్ అవాకులు చెవాకులు పేలుతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ కుటుంబంపై ప్రజలకు విశ్వాసం పోతుంది : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

కేసీఆర్ కుటుంబంపై ప్రజలకు విశ్వాసం పోతుంది : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి


వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తుందని... అందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఆ లక్ష్మీనారసింహుడిని వేడుకున్నానని కేంద్ర బొగ్గు,గనుల మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని కేంద్రమంత్రి ప్రహ్లాద జోషి గురువారం నాడు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణాలో కెసిఆర్ మరియు కేటీఆర్ కుటుంబ సభ్యుల పైన తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయిందని, ఇలాంటి తరుణంలో తమ కార్యకర్తలు సమర్దవంతంగా పని చేసి పార్టీని అధికారంలోకి తేవాలని అన్నారు.

కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసే సమయం దగ్గరలోనే

కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసే సమయం దగ్గరలోనే


కెసిఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసే సమయం దగ్గర్లోనే ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎక్కువగా ఉన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సింగరేణి లో కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటా కన్నా తక్కువగా ఉందని, సింగరేణి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ పై ఆయన మండిపడ్డారు.

కేసీఆర్ అబద్దాల కంపెనీ తాయారు చేస్తున్నాడు

కేసీఆర్ అబద్దాల కంపెనీ తాయారు చేస్తున్నాడు

కెసిఆర్ తన అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ అబద్ధాలు చెప్పే కంపెనీని తయారు చేస్తున్నాడని ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ఇప్పటికైనా కెసిఆర్ అబద్ధాలు మానుకోవాలని ఆయన సూచించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి ప్రజలకు మరింత చేరువ చేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.

కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అధికార దుర్వినియోగంపై ప్రజల్లో అసహనం

కేసీఆర్ ప్రభుత్వ అవినీతి, అధికార దుర్వినియోగంపై ప్రజల్లో అసహనం

రాష్ట్రవ్యాప్తంగా బిజెపి శ్రేణులకు ఇది సరైన సమయం అని కెసిఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనలో ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వం పై రాష్ట్ర ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+