కేసీఆర్ రాజనీతి.. శత్రువులను పాజిటివ్ గా కూడా దెబ్బ తియ్యొచ్చు!!
శత్రువులను సానుకూలంగా ఢీ కొట్టవచ్చు అన్నది కేసీఆర్ రాజకీయం. తాజాగా పాజిటివ్ గా మాట్లాడి ఈటల రాజేందర్ ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేశారు కేసీఆర్ .
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాజనీతిలో దిట్ట. ఆయనకు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో.. ఎవరికి ఏ విధంగా చెక్ పెట్టాలో తెలిసిన రాజకీయ ఉద్దండుడు. అందుకే తాజాగా ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగం, శత్రువుగా భావించిన వ్యక్తిపై ప్రేమ కురిపించిన వైనం చర్చనీయాంశం కాగా, సదరు నేతను డిఫెన్స్ లో పడేసింది.

ప్రతిపక్ష పార్టీ నేతలకు తెలివిగా చెక్ పెడుతున్న కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వినా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి నేడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా రెండు దఫాలుగా తిరుగులేని పాలన సాగిస్తున్నారు. అటువంటి కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న వేళ, స్వరాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలకు తెలివిగా చెక్ పెడుతున్నారు.

పాజిటివ్ గా శత్రువుల టోన్ తగ్గిస్తున్న కేసీఆర్ ..
తన పైన తీవ్రమైన మాటల దాడి చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులను పాజిటివ్ గా ఫిక్స్ చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలంటే చాలావరకు వారిపై ఒత్తిడి తీసుకురావడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, కేసులు పెట్టడం వంటి వాటిపైన ప్రధానంగా అందరూ దృష్టి సారిస్తూ ఉంటారు. కానీ శత్రువులు చెప్పింది విని, వారి విషయంలో సానుకూలంగా స్పందించి, వారిపై అభిమానం ఉన్నట్టుగా మాట్లాడటం ద్వారా కూడా వారి టోన్ తగ్గించవచ్చని సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.

ఈటల రాజేందర్ పై కేసీఆర్ ప్రేమ.. చాలా పాజిటివ్ గా
తాజాగా అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ కు తన మార్కు రాజకీయాన్ని చూపించి తన ప్రసంగంలో అనేకమార్లు ఈటల రాజేందర్, రాజేందర్ అన్న అంటూ ఎంతో పాజిటివ్ గా ప్రస్తావించారు. అవసరమైతే ఆయన సలహాలు తీసుకుంటామని, ఈటల రాజేందర్ ఈరోజు ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లొచ్చు కానీ ఆయనకు అన్నీ తెలుసు అంటూ ఈటల రాజేందర్ తన మనిషే అన్న తీరులో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈటల రాజేందర్ చెప్పే విషయాలను జాగ్రత్తగా వినాలని, ఆయన లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకోవాలని కూడా హరీష్ రావుకు సీఎం కేసీఆర్ సూచించారు.

కేసీఆర్ పాజిటివ్ గా మాట్లాడటమే ఈటలకు నెగిటివ్ అవుతుందా?
ఇక సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో ఈటల రాజేందర్ మళ్ళీ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారు అన్న అనుమానం అన్ని రాజకీయ పార్టీ నేతలలోనూ కలుగుతుంది. ఈటలను సెల్ఫ్ డిఫెన్స్ లోకి నెట్టింది. తన విషయంలో సానుకూలంగా ఉన్న సీఎం కేసీఆర్ ను ఈటల రాజేందర్ గట్టిగా తిట్టలేని పరిస్థితిని ఆయన కల్పించారు. ఇక ఇదే సమయంలో తను పార్టీ మారబోనని ప్రతి ఒక్కరికి సంజాయిషీ చెప్పుకునే పరిస్థితిని ఈటల రాజేందర్ కు తీసుకువచ్చారు సీఎం కేసీఆర్.

కేసీఆర్ రాజనీతిపై అందరిలో చర్చ
ఆయన తన పట్ల ఎంత పాజిటివ్ గా మాట్లాడినా తాను మళ్ళీ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేది లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను పార్టీలో నుంచి బయటకు రాలేదని, బలవంతంగా తనను పార్టీ నుంచి గెంటేసారని గుర్తు చేసుకున్న ఈటల రాజేందర్, ప్రజలు ఎవరు ఈ విషయాన్ని మరిచిపోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరటం కన్నా చచ్చిపోవడం మంచిదని అందరికీ సంజాయిషీ ఇచ్చుకునేలా ఈటల రాజేందర్ పరిస్థితిని తీసుకువచ్చారు సీఎం కేసీఆర్. నాలుగు మంచి మాటలతో కూడా ప్రత్యర్ధులను ఇరకాటంలో పెట్టొచ్చని తెలిసిన కెసిఆర్ రాజనీతి ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications