• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అప్పుడే వద్దు.. కాస్త సంయమనం!: 'షా' విమర్శలపై కేసీఆర్ వ్యూహం..

|

హైదరాబాద్: దక్షిణాదిలో పాగా వేయాలని ఏళ్లుగా ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి.. తొలుత తెలంగాణలో జవసత్వాలు ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నట్లున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నా.. బీజేపీ మార్క్ పాలిటిక్స్ తో జనంలోకి వెళ్లడానికి షా అప్పుడే రెడీ అయిపోయారు.

తిరుపతికి కానుకలిస్తే నిలదీయరా?, గాలి లెక్కలొద్దు: టి నేతలపై షా తీవ్ర ఆగ్రహం

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన తెలంగాణ పర్యటన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు కేవలం ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టకుండా నిరంతరం ఇక్కడి పరిస్థితులను మానిటర్ చేయాలని షా భావిస్తున్నారు. అందుకే బీజేపీ నేతలతో సైతం ఇకనుంచి ప్రతీ మూడు నెలలకు ఒకసారి తెలంగాణలో పర్యటిస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ లెక్కన తెలంగాణలో బీజేపీ పునాదులు పటిష్టపరిచడానికి అమిత్ షా గట్టిగానే కసరత్తులు మొదలుపెట్టాలని చెప్పాలి.

తెలంగాణలో అధికారం మాదే, కేంద్ర పథకాలు అమలు కావడంలేదు: అమిత్ షా

కేసీఆర్ స్పందనేంటి?:

కేసీఆర్ స్పందనేంటి?:

రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్న టీఆర్ఎస్ ను బీజేపీ ఎదుర్కోవడం అంత సులువేమి కాదు. అయినప్పటికీ.. అమిత్ షా మార్క్ రాజకీయం ఇదివరకు చాలా రాష్ట్రాల్లో పనిచేసింది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ఆయన పట్ల అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. అమిత్ షా రాజకీయాలను ఒక కంట కనిపెడుతూనే ఉంది. అదే సమయంలో ఆయన వ్యాఖ్యల పట్ల ఆవేశపడి కామెంట్స్ చేయడం కంటే సంయమనం పాటించడమే మంచిదన్న రీతిలో ఆ పార్టీ ధోరణి ఉంది. సీఎం కేసీఆర్ సైతం పార్టీ నేతలకు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

'షా' పర్యటన ముగిశాకే:

'షా' పర్యటన ముగిశాకే:

ఆవేశపడి అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించడం కంటే.. అమిత్ షా పర్యటన ముగిసిన తర్వాత.. ఆయన చేసిన విమర్శలను సమీక్షించుకున్న తర్వాతే స్పందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు మంత్రులకు, పార్టీ నాయకులకు సంయమనం పాటించాల్సిందిగా ఆయన నుంచి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

బీజేపీతో సఖ్యంగానే:

బీజేపీతో సఖ్యంగానే:

ఎన్నికల సమయంలో మోడీపై ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేసిన కేసీఆర్.. ఆ తర్వాత తన వైఖరి మార్చుకున్నారు. కేంద్రంలో బీజేపీతో సఖ్యతతోనే మెదులుతున్నారు. అటు మోడీ సైతం కేసీఆర్ వైఖరిపై సానుకూలంగానే ఉన్నారు. కాబట్టే, రాష్ట్ర ప్రభుత్వ వినతులపై కేంద్రం సకాలంలో స్పందిస్తుందన్న అభిప్రాయం ఉంది.

కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి మోడీ కూడా వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్డీయేలో టీఆర్ఎస్ భాగస్వామి కాకపోయినా.. ఆ పార్టీ పట్ల మోడీ శత్రుత్వ వైఖరేమి కనబర్చడం లేదు. ఇటీవలే భూసేకరణ బిల్లుకు ఆమోదం, రాష్ట్ర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు, దాంతో పాటు కొత్త సచివాలయ నిర్మాణానికి పరేడ్ గ్రౌండ్ స్థలాన్ని కేటాయించడం వంటి విషయాల పట్ల కేంద్రం టీఆర్ఎస్ వినతులపై సానుకూలంగానే స్పందించింది. ఈ మేరకు అనుమతులు కూడా మంజూరు చేసింది.

ఆచితూచి వ్యవహరించాలని:

ఆచితూచి వ్యవహరించాలని:

బీజేపీతో సఖ్యతగా మెదులుతున్న నేపథ్యంలో.. అమిత్ షా పర్యటనపై విమర్శలు చేయడం కన్నా ఆచితూచి స్పందించడమే మేలు అనేది కేసీఆర్ ఆలోచన. మరోవైపు కేంద్రం నిర్ణయాలు కూడా రాష్ట్రానికి వ్యతిరేకంగా లేవు కాబట్టి అప్పుడే ఆవేశపడి బీజేపీపై విమర్శలు చేయడం కన్నా.. కాస్త వేచి చూసే ధోరణి అవలంభించాలనే వ్యూహం కూడా కేసీఆర్ యోచనలో ఉంది.

కాంగ్రెస్ నేతలకే గాలం:

కాంగ్రెస్ నేతలకే గాలం:

రాష్ట్రంలో బీజేపీని బలోపపేతం చేయడానికి అమిత్ షా.. కాంగ్రెస్ నాయకులకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను గుర్తించేందుకు అమిత్ షా తన తదుపరి పర్యటనల్లో వ్యూహాలు రచించే అవకాశం ఉంది. బీజేపీ నేతలు సైతం టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని తరుచూ చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో టీఆర్ఎస్-బీజేపీ మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది మరింత ఆసక్తికరంగా మారనుంది.

English summary
Telangana CM KCR sent his orders in to Trs cadre about Amit shah telangana tour. He suggested to leaders 'take time and respond but dont be quick'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more