• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు నేనే చెప్పా కానీ మాటల్లోపడి, అసదుద్దీన్ అలా చేయరు: కేసీఆర్, మోడీపై ఫైర్

|

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ గురువారం నిర్మల్, ఖానాపూర్, ముధోల్ తదితర ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, విపక్షాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై కూడా నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో తెరాస ఓడిపోతే తనకు వచ్చే నష్టమేమీ లేదని, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటానని, కానీ తెలంగాణ మాత్రం చంద్రబాబు చేతికి వెళ్తోందని హెచ్చరించారు.

చివరి నిమిషం దాకా ఆశపెట్టి: కేసీఆర్‌కు మరో భారీ షాక్, రాజీనామా చేసిన కీలకనేతచివరి నిమిషం దాకా ఆశపెట్టి: కేసీఆర్‌కు మరో భారీ షాక్, రాజీనామా చేసిన కీలకనేత

గత పాలకుల కారణంగానే రాష్ట్రంలో సమస్యలు వచ్చాయని చెప్పారు. అభివృద్ధి జరిగిందా లేదా అన్న అంశంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. తెలంగాణ వాళ్లకు పాలించే తెలివి లేదని ఎగతాళి చేశారని మండిపడ్డారు. ఏపీలో మేధావులు ఉన్నప్పటికీ 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. తాము మేనిఫెస్టోలోని అంశాలే కాకుండా చెప్పనివి కూడా చేశామని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు లేవని చెప్పారు. టీఆర్ఎస్ గెలవకుంటే తెలంగాణ రాష్ట్రం చంద్రబాబు చేతుల్లోకి వెళ్తుందని చెప్పారు.

ఎన్నికలు వస్తే ఆగం కావొద్దు

ఎన్నికలు వస్తే ఆగం కావొద్దు

ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావొద్దని, ఆలోచించాలని కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నెలలోపు పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. కాంగ్రెస్‌కు 40 ఏళ్లు, టీడీపీకి 17 ఏళ్లు పాలించే అధికారం ఇచ్చినా ఏం చేయలేదన్నారు. తెలంగాణను ఏపీలో కలిపింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని కొంతమంది బెదిరించారని చెప్పారు. కష్టపడి మనం తెలంగాణ తీసుకు వస్తే కాంగ్రెస్ మళ్లీ చంద్రబాబును తీసుకు వస్తోందని చెప్పారు. ఆలస్యమైనా సరే పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.

మోడీని ఏకిపారేసిన కేసీఆర్

మోడీని ఏకిపారేసిన కేసీఆర్

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. 2019లో కేంద్రంలో ఫ్రంట్ వస్తుందని జోస్యం చెప్పారు. ముస్లీంలకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడానికి మోడీ జాగీరా అన్నారు. కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఢిల్లీలో వస్తుందని చెప్పారు. తెలంగాణ వస్తుందని తాను చెబితే మొదట ఎవరూ నమ్మలేదని, వచ్చిందని, ఇప్పుడు ఫ్రంట్ కూడా అంతే.. వచ్చి తీరుతుందన్నారు. మోడీకి హిందూ, ముస్లీంలను విడదీసే రోగం ఉందని చెప్పారు. అందుకే రిజర్వేషన్లపై వెనుకడుగు అన్నారు.

చంద్రబాబుకు నేను చెప్పా కానీ, మాటల్లోపడి

చంద్రబాబుకు నేను చెప్పా కానీ, మాటల్లోపడి

చంద్రబాబుకు తెలంగాణ ఆచారాలు పెద్దగా తెలియవని కేసీఆర్ చెప్పారు. ఇమామ్‌ జమీన్‌.. క్షేమంగా పోయి లాభంగా రా అని బంధువులు, పెద్దలు దీవించి కట్టే పట్టీ పవిత్రమైనదన్నారు. ఆంధ్రా వాళ్లకు అది తెలియదని పట్టి అని రాస్తారన్నారు. దాన్ని కట్టినప్పటి నుంచి దేశమంతా కడుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా, తాను మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్‌ జిల్లాకు వెళ్తే రంజాన్‌ మాసం కావడంతో మసీదు నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు బయటకు వచ్చిన సందర్భంలో రంజాన్‌ మాసం పవిత్రమైనది, ముస్లిం సోదరులకు ఈద్‌ ముబారక్‌ చెప్పాలని తాను చంద్రబాబుతో చెప్పానని, కానీ ఆయన మాటల్లో పడి తాను చెప్పింది మరిచిపోయారని, ముస్లిం సోదరులకు ఊద్‌ ముబారక్‌ అని చెప్పారన్నారు.

రిజర్వేషన్లు సాధిస్తాం

రిజర్వేషన్లు సాధిస్తాం

తెలంగాణ రీతి, రివాజు, కల్చర్‌ చంద్రబాబుకు తెలియదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ నుంచి ఎన్నికైన పదిహేడు మంది ఎంపీలు అందరూ కలిసి రిజర్వేషన్లు సాధిస్తారన్నారు. కేసీఆర్‌ లేకపోతే ఈ జన్మలో కూడా నిర్మల్‌ జిల్లా అయ్యేది కాదన్నారు. నిర్మల్‌ను జిల్లా చేసేందుకు ఇంద్రకరణ్‌ రెడ్డి కృషి చేశారన్నారు. నిర్మల్‌కు రైలు వస్తుందని, మెడికల్‌ కళాశాల కూడా వస్తుందన్నారు. రాష్ట్రం సాధించింది తానేనని, తాను చిల్లర వాగ్ధానాలు చేయనని చెప్పారు.

రూ.25 కోట్లు ఇచ్చినా అసదుద్దీన్ అలా చేయరు

రూ.25 కోట్లు ఇచ్చినా అసదుద్దీన్ అలా చేయరు

నిర్మల్‌లో ప్రచారం చేయకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కాంగ్రెస్ నేతలు ఆశ చూపారని, రూ.25 కోట్లు ఇచ్చినా ఆయన అలాంటి పనులు చేయరని కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలసి పని చేస్తున్నాయన్నారు. ముస్లింలంతా తెరాసకే అండగా ఉంటారన్నారు.

English summary
Telangana Care Taker CM K Chandrasekhar Rao fired at PM Narendra Modi and AP CM Chandrababu Naidu in his public meetings. He praised MIM chief Asaduddin Owaisi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X