అద్భుతం: చైనా వాల్‌పై కెసిఆర్, తియానన్మెన్ స్కేర్ సందర్శన(పిక్చర్స్)
బీజింగ్/హైదరాబాద్: చైనాలోని చారిత్రక కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఆ దేశ విశిష్టతను, ఔన్నత్యాన్ని వెల్లడించడంతో పాటు సంస్కృతికి చిహ్నాలుగా అవి ఉన్నాయని తెలిపారు. పర్యాటకపరంగా వీటికి ఎనలేని గుర్తింపు ఉందని చెప్పారు.
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీష్‌రెడ్డిలతో పాటు సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ కేశవరావు తదితర బృందంతో కలిసి తియానన్మెన్ స్క్వేర్‌ను, చైనా మహా కుడ్యాన్ని(గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) సందర్శించారు. ఉద్యమాలకు వేదిక అయిన తియానన్మెన్ స్క్వేర్ వద్ద చైనా మహా మందిరాన్ని, జాతీయ మ్యూజియాన్ని, మావో స్మారక మందిరాన్ని పరిశీలించారు.
ప్రపంచంలోని భారీ నగరాల్లో తియాన్మెన్ స్క్వేర్ ఒకటని ఈ సందర్భంగా చైనా అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అనేక చారిత్రక సంఘటనలకు ఇది వేదికగా నిలిచిందని వెల్లడించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మహాకుడ్యం వద్దకు వెళ్లి దాని నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ నిర్మిత కట్టడమని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.
కుడ్యం విస్తరణ, పునర్నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలను అధికారులు ఆయనకు వివరించారు.రెండు ప్రాంతాల సందర్శన అనంతరం కేసీఆర్ షెంజెన్ నగరానికి బయల్దేరారు. ఆదివారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. చైనా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ షెంజెన్‌లో హైటెక్ పారిశ్రామిక పార్కును సందర్శించనున్నారు.

కెసిఆర్ బృందం
చైనాలోని చారిత్రక కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

కెసిఆర్ బృందం
ఆ దేశ విశిష్టతను, ఔన్నత్యాన్ని వెల్లడించడంతో పాటు సంస్కృతికి చిహ్నాలుగా అవి ఉన్నాయని తెలిపారు. పర్యాటకపరంగా వీటికి ఎనలేని గుర్తింపు ఉందని చెప్పారు.

కెసిఆర్ బృందం
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీష్‌రెడ్డిలతో పాటు సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఎంపీ కేశవరావు తదితర బృందంతో కలిసి తియానన్మెన్ స్క్వేర్‌ను, చైనా మహా కుడ్యాన్ని(గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) సందర్శించారు.

కెసిఆర్ బృందం
ఉద్యమాలకు వేదిక అయిన తియానన్మెన్ స్క్వేర్ వద్ద చైనా మహా మందిరాన్ని, జాతీయ మ్యూజియాన్ని, మావో స్మారక మందిరాన్ని పరిశీలించారు.

కెసిఆర్ బృందం
ప్రపంచంలోని భారీ నగరాల్లో తియాన్మెన్ స్క్వేర్ ఒకటని ఈ సందర్భంగా చైనా అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అనేక చారిత్రక సంఘటనలకు ఇది వేదికగా నిలిచిందని వెల్లడించారు.

చైనా వాల్
ఆ తర్వాత ముఖ్యమంత్రి మహాకుడ్యం వద్దకు వెళ్లి దాని నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ నిర్మిత కట్టడమని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు.

చైనా వాల్
కుడ్యం విస్తరణ, పునర్నిర్మాణం, నిర్వహణ తదితర అంశాలను అధికారులు ఆయనకు వివరించారు.

కెసిఆర్ బృందం
రెండు ప్రాంతాల సందర్శన అనంతరం కేసీఆర్ షెంజెన్ నగరానికి బయల్దేరారు. ఆదివారం రాత్రి అక్కడికి చేరుకున్నారు.

కెసిఆర్ బృందం
చైనా పర్యటనలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ షెంజెన్‌లో హైటెక్ పారిశ్రామిక పార్కును సందర్శిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పారిశ్రామిక పార్కుగా ఇది ప్రసిద్ధి పొందింది.

కెసిఆర్ బృందం
ఈ పార్కులో సమీకృత సర్య్యూట్, సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్, బయోటెక్, ఆప్టికల్ ఎలక్ట్రోమెకానికల్, భారీ యంత్ర పరిశ్రమలతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లు, ఉన్నత విద్యాపరిశోధన, శాస్త్ర సాంకేతిక మండళ్లు ఉన్నాయి.

కెసిఆర్ బృందం
ఈ పార్కును సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. సోమవారం రాత్రికి హాంకాంగ్‌కు బయల్దేరుతారు.












Click it and Unblock the Notifications