మనవళ్లతో టపాసులు పేల్చిన కెసిఆర్: హైదరాబాద్ వెళ్తూ వాగు వద్ద ఆగారు (పిక్చర్స్)

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు ఎర్రవల్లి గ్రామంలో పర్యటించారు. చేబర్తి వాగువద్ద పరిస్థితిని పరిశీలించారు.

సీఎం కెసిఆర్ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తాను దత్తత తీసుకున్న గ్రామాల పైన ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... చేబర్తి వాగుపై రెండు వంతెనలు, ఐదు చెక్ డ్యామ్‌లు నిర్మిస్తే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగడంతోపాటు రైతులకు జీవనధారగా మారుతుందని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

గురువారం ఆయన తన వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యంలో ఉన్న ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో పర్యటించిన తర్వాత చేబర్తి వాగు వద్ద కొద్దిసేపు ఆగారు.

 కెసిఆర్

కెసిఆర్

ఈ వాగు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయిలో సర్వే జరిపి నివేదిక సమర్పించాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.

కెసిఆర్

కెసిఆర్

ఎర్రవల్లి, నర్సన్నపేట మధ్య ఒకటి, అలిరాజపేట, ఇటిక్యాల గ్రామాల మధ్య మరో వంతెన నిర్మాణంతోపాటు ఐదు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కూడవెల్లి వాగుకు జన్మనిచ్చిన చేబర్తి వాగును అభివృద్ధి పర్చాల్సి ఉన్నదన్నారు. అన్ని విధాలుగా ఈ వాగును అభివృద్ధి చేయడంతోపాటు వంతెనలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం జూన్‌కల్లా పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

కెసిఆర్

కెసిఆర్

వర్షాధారిత నీటితో చేబర్తి చెరువు నిండటంతోపాటు చెక్‌డ్యామ్‌ల్లో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటే అది జీవనదిగా మారుతుందని సీఎం అన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

పాములపర్తిలో నిర్మించే రిజర్వాయర్ ద్వారా వచ్చే రెండేండ్లలో చేబర్తి చెరువు నింపుకోవడంతోపాటు చెక్‌డ్యామ్‌ల్లో ఎల్లవేళలా నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల మూడువేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

తద్వారా రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశముందన్నారు. అనంతరం ఆయన నర్సన్నపేటలో పాదయాత్ర చేశారు. వీధులన్నీ కలియదిరుగుతూ ఇండ్ల కూల్చివేత పనులు పర్యవేక్షించారు.

 కెసిఆర్

కెసిఆర్

రెండు గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని గడా ఓఎస్డీ హన్మంతరావుకు సూచించారు. బుధవారం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కెట్ఆర్‌తో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మనుమలతో కలిసి పటాకులు పేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+