కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే.. కడియం శ్రీహరి హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ కుటుంబం పెద్ద మొత్తంలో వనరులను దోచుకుందని ఆరోపించారు. కొత్త రకమైన అవినీతికి పాల్పడ్డారన్నారు. మీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
లిక్కర్ కేసులో ఇరుక్కుని కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఎన్ని రోజులు ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మరోవైపు, ఫార్ములా ఈ కేసులో రేపో మాపో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా జైలుకు వెళ్లబోతున్నారని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీశ్ రావు అనేక విధాలుగా సాంకేతిక తప్పులు చేశారని మండిపడ్డారు.

కల్వకుంట్ల కేసీఆర్ కుటంబమంతా రేపో మాపో జైలులో ఊచలు లెక్కపెట్టబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. మీరు నిజాయితీపరులైతే మీపై ఇన్ని కేసులు ఎందుకు నమోదవుతాయని కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించారు. 2014లో కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.
అప్పుడు రూ. 10 కోట్ల ఆస్తులు లేని మీకు.. ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు, వందలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయని కడియం శ్రీహరి ప్రశ్నించారు. దళితబంధులో కమీషన్ తీసుకున్నవారు.. ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు నీతులు మాట్లాడటం హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. కడియం శ్రీహరి తప్పు చేస్తే ఆధారాలు చూపించాలని.. ఇకనైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications