రేషన్ కార్డుదారులకు కీలక అలెర్ట్..15 రోజుల్లో ఆ పని చెయ్యకుంటే రేషన్ రద్దు!
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు దారులు అందరికీ బిగ్ అలర్ట్. రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులు అందరికీ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డు తో సంబంధం ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో రేషన్ వచ్చే అవకాశం లేదని, కనుక ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని మరోమారు స్పష్టం చేసింది.
రేషన్ కార్డుదారులకు అలెర్ట్
ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి డిసెంబర్ 31వ తేదీ తుది గడువు కాగా రేషన్ కార్డులు ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలని పేర్కొంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈనెల 31వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని యూనిట్ల రేషన్ సరఫరాను నిలిపివేస్తామని, వారి రేషన్ కోటా రద్దు అవుతుందని కీలక ప్రకటన చేసింది.

ఈకేవైసీ ఇలా నమోదు చెయ్యాలి
ఈకేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈపాస్ మిషన్లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది ఫింగర్ ప్రింట్స్ ఈపాస్ మిషన్లో నమోదు కావడం లేదని కార్డుదారుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి.
సాంకేతిక సమస్యలతో ఈకేవైసీ విషయంలో గందరగోళం
ఈ క్రమంలో సాంకేతిక లోపాలతో ఈకేవైసీ పూర్తి చేయకపోతే అది తమ తప్పు ఎలా అవుతుంది అని రేషన్ కార్డు దారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని, ఈ కేవైసీ గడువును మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు అందవని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సమీపిస్తున్న తుది గడువు.. అలెర్ట్
ముఖ్యంగా రాష్ట్రంలో పేదల కోసం అమల్లో ఉన్నటువంటి బియ్యం పంపిణీ, ఆరోగ్య పథకాలు, ఇతర నగదు బదిలీ పథకాలలో లబ్ధి పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా చాలామంది ఈకేవైసీ పెండింగ్లో ఉంది. చివరి తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఆఖరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తుంది.
లబ్దిదారులలో టెన్షన్
ఏది ఏమైనా పౌరసరఫరాల శాఖ పెట్టిన డెడ్లైన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఈ కేవైసీ పూర్తికాని రేషన్ కార్డుదారులకు టెన్షన్ పుట్టిస్తుంది. వారి సమస్యలను పరిష్కరించి, ఈకేవైసీ కి ప్రభుత్వం సహాయం చేస్తుందా? లేదా డిసెంబరు 31తో ఈ కేవైసీ ప్రక్రియను క్లోజ్ చేసి ఈకేవైసీ చేయని వారి పేర్లను రేషన్ కార్డుల నుండి తొలగిస్తుందా అనేది ఇప్పుడు అందరిని ఆలోచించేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications