ఖైరతాబాద్ లో త్రిముఖ పోరు, కలిసొచ్చేదెవరికి- గ్రౌండ్ రిపోర్ట్..!!
తెలంగాణ రాజకీయం ఖైరతాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. దానం నాగేందర్ పై అనర్హత వేటుతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నిక లో పోటీ చేసే అభ్యర్ధుల పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. గ్రేటర్ ఎన్నికలు సైతం ఉండటంతో... ఇక హైదరాబాద్ పరిధిలో జరిగే ఈ వరుస ఎన్నికలు 2025 అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా మారుతున్నాయి. కాగా.. ఖైరతాబాద్ లో మాత్రం పబ్లిక్ మూడ్ క్లియర్ గా ఉంది. ఏ పార్టీకి ఈ ఎన్నిక కలిసి వస్తుందనేది స్పష్టత వస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతోంది. మిగిలిన కాలం వచ్చే ఎన్నికల కోసం సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. ఇందు కోసం కొత్త వ్యూహాల ను సిద్దం చేస్తున్నాయి. అందులో భాగంగా గ్రేటర్ తో పాటుగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన స్పెషల్ ఫోకస్ చేసాయి. దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఈ ఉప ఎన్నిక ఖాయమైంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధుల విషయంలో ఒక స్పష్టతకు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి తిరిగి దానం కు ఛాన్స్ ఉంటుందా లేదా అనే చర్చ సాగుతున్నా.. వ్యక్తిగతంగా దానం కు అక్కడ ఉన్న పట్టు కారణంగా పార్టీ అభ్యర్దిగా ఆయనే ఖరారు కావటం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు.. బీజేపీ నుంచి రామచంద్రా రెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం. త్రిముఖ పోటీ జరగనున్న ఖైరతాబాద్ లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కీలక సమీకరణాలు మొదలయ్యాయి.

త్రిముఖ పోరు.. స్థానిక అంశాలే కీలకం
ఖైరతాబాద్ ఉప ఎన్నికలోనూ జూబ్లీహిల్స్ ఫార్ములా అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బస్తీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో మంత్రులకు వారిని ఆకర్షించే బాధ్యతలు అప్పగించనుంది. అదే విధంగా ఎంఐఎం సహకారం తీసుకోనుంది. మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు ఈ నియోజక వర్గం లో బలమైన పునాదులు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఓటర్లను ఆకర్షించేలా గతంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. నియోజకవర్గంలోని వైవిధ్యమైన సామాజిక సమీకరణాలు, ప్రత్యేకించి బస్తీలలో ఉన్న ఓటర్ల నాడిని పట్టడంలో బిఆర్ఎస్ గత అనుభవాలను నమ్ముకుంది.బీజేపీ సైతం తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. కాగా.. సామాజిక లెక్కలు కీలకం అవుతున్నాయి. ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయినా.. అభ్యర్ధులు.. చోటు చేసుకునే పరిణామాలు.. ప్రచారం.. ఎన్నిక సమయంలో చోటు చేసుకునే పరిణామాలు విజేతను ఖరారు చేయనున్నాయి.













Click it and Unblock the Notifications
