ఖమ్మం గ్యాంగ్ రేప్: పోలీసుల చేతిలో అఖిల్, రేప్ వీడియోలూ స్వాధీనం
ఖమ్మం గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నుంచి బుధవారం ఉదయం అతను ఖమ్మం చేరుకున్నాడు. అతను తన ఇంటికి వెళ్లకుండా బంధువుల ఇంటికి వెళ్లాడు.
ఖమ్మం: ఖమ్మం గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు అఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి నుంచి బుధవారం ఉదయం అతను ఖమ్మం చేరుకున్నాడు. అతను తన ఇంటికి వెళ్లకుండా బంధువుల ఇంటికి వెళ్లాడు. విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకున్నారు.
అతడి వద్ద నుంచి సామూహిక అత్యాచారం వీడియోలు, ఫొటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఓ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు అఖిల్‌పై ఒత్తిడి తెచ్చింది. ఆమెను వదిలించుకోవాలనే కుట్రతో అఖిల్ ఈ నెల 1న ఆమెపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేసి, వీడియోలు తీసిన విషయం తెలిసిందే.

వాటిని అడ్డుపెట్టుకుని మళ్లీ తమ కోర్కెలు తీర్చాలని, లేదంటే వీడియోలను ఇంటర్‌నెట్‌లో పెడతామని బెదిరించారు. యువతి ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాంతో ప్రధాన నిందితుడైన అఖిల్ తిరుపతి పారిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందం తిరుపతి వెళ్లింది.
అయితే, బుధవారం అఖిల్ ఖమ్మం వచ్చిన విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం బస్‌డిపో రోడ్డుకు చెందిన అఖిల్, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన ఉదయ్, ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన కార్తీక్‌లపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, పోక్సో కేసులు నమోదుచేసినట్టు తెలిసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన రాధాకృష్ణపై వీటితో పాటు అదనంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications