వైయస్‌లాగే కెసిఆర్, కేంద్రమంత్రులు కచ్చితంగా వస్తారు: కిషన్, మంత్రి కెటిఆర్‌కు చేదు
వరంగల్: గతంలో వైయస్ రాజశేఖర రెడ్డిలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిసిలకు అన్యాయం చేసేందుకు చూస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించాలన్న కసితో ప్రజలు ఉన్నారని చెప్పారు. ప్రచారానికి భయపడే టిఆర్ఎస్ నేతలు, మంత్రులు పోలీసులను వెంట తెచ్చుకుంటున్నారన్నారు. ప్రచారంలో కేంద్రమంత్రులు కచ్చితంగా పాల్గొంటారని చెప్పారు. పత్తి రైతుల సమస్యలను ప్రశ్నిస్తే ప్రభుత్వం కేసు పెడుతోందన్నారు.

మంత్రి కెటిఆర్‌కు నిలదీత
వరంగల్ ఉప ఎన్నికల్లో పాల్గొన్న మంత్రి కెటి రామారావుకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఆయనను ఎమ్మార్పీఎస్ నేతలు నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ పైన టిఆర్ఎస్ వైఖరి చెప్పాలని నిలదీశారు. కాగా, టిఆర్ఎస్ నేతలు, మంత్రులను ప్రచారంలో నిలదీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిపై ఎంపీ బాల్క సుమన్ స్పందించారు. నియోజకవర్గాల్లో మంత్రులను ఎవరూ నిలదీయడం లేదని, తమ సమస్యలు చెప్పుకునేందుకే ప్రజలు వస్తున్నారని చెప్పారు. మెస్ బకాయిలు రూ.7 కోట్లు విడుదల చేసిన సీఎం కెసిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు తమను నిలదీస్తున్నారని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications