Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూబ్లీహిల్స్ బై పోల్ లో KK సర్వే సంచలనం.. గెలిచేది ఆ పార్టీనే..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ సైతం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అటు బీజేపీ సైతం విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. దీంతో ఈ బై పోల్ రసవత్తరంగా మారింది. అయితే తాజాగా జూబ్లీహిల్స్ బై పోల్ పై KK సర్వే సంచలన ప్రకటన చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విక్టరీ కొట్టేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తేల్చింది. జూబ్లీహిల్స్ లోని ఏరియాల వారీగా చేపట్టిన సర్వేలో అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి 12 నుంచి 13 శాతం మెజార్టీ వచ్చినట్లు స్పష్టం చేసింది.

బోరబండ, శ్రీ నగర్ కాలనీ, ఎర్రగడ్డ, షేక్ పేట.. ప్రాంతాల్లో బీఆర్ఎస్ డామినేషన్ అధికంగా ఉన్నట్లు తమ సర్వేలో తేలిందని కేకే స్పష్టం చేసింది. రెహమత్ నగర్, వెంగళ్ రావు నగర్ లో కాంగ్రెస్ బలంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 55 శాతం ఓట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది. అయితే గతంలో కొన్ని రాష్ట్రాల్లో కేకే సర్వే ఫలితాలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈసారి జూబ్లీహిల్స్ లాంటి బలమైన పోటీ ఉన్న నియోజకవర్గంలో ఇంత పెద్ద తేడాతో బీఆర్‌ఎస్ విజయాన్ని ప్రకటించడంపై .. కేకే సర్వే కొంత రిస్క్ తీసుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.

ఇక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో విజయం కోసం ప్రతిపక్ష బీఆర్​ఎస్​ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపినాథ్‌ సతీమణి సునీతను ప్రకటించింది. ఈ క్రమంలో సానుభూతి ఓట్లతో పాటు పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో చేసిన అభివృద్ధిపైనే అధికంగా ఆధారపడింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ.. జూబ్లీహిల్స్​ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ తరఫున సీఎం రేవంత్​ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా రెహమత్​ నగర్​ లోని పీజేఆర్​ విగ్రహం వద్ద నుంచి రోడ్​ షో నిర్వహించారు. జూబ్లీహిల్స్​ గడ్డపై కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ మైనారిటీ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. మైనారిటీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసి వస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

KK Survey Predicts BRS Victory in Jubilee Hills Bypoll

మరోవైపు జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలకు లంకల దీపక్‌ రెడ్డిని బీజేపీ అధిష్ఠానం అభ్యర్థిగా నియమించింది. 2023లోనూ జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి పోటీ చేశారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+