Fresh Bus: ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు!

సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 65వ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Fresh Bus) .. ఐరన్‌ లోడుతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ భయానక ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు, ఓవర్ స్పీడే యాక్సిడెంట్ కు కారణమని తెలుస్తుంది.

బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు. వీరిలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద శబ్దం విన్న స్థానికులు, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను క్షతగాత్రుల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

Kodada Bus Accident Private Travel Bus Rams Container Truck near Kodada 6 Dead and Many Injured

సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయ్యి, మృతదేహాలు బస్సులోనే చిక్కుకుపోవడంతో వాటిని వెలికితీయడానికి కష్టపడాల్సి వచ్చింది.

మృతులు వివరాలు

  • యాసారపు చిన్ని(32)
  • బొల్లిపొంగు మేరీ జోష్న(29)
  • చెన్నకేశవుల నాగేంద్రబాబు (21)
  • సురవరపు షకీనా
  • భావన
  • లక్ష్మీ

ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+