కేసీఆర్‌కు కొత్త ఇల్లు ఎందుకు?: కోదండరాం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి కొత్త నివాసం అవసరం లేదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి కొత్త ఇళ్లు కావాలనుకుంటే ప్రభుత్వ భవనాలు చాలా ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోకుండా ప్రజాధనాన్ని ఇలా వృథా చేయడం సరికాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే కొత్త బంగళాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తీవ్ర విమర్శలు చేశారు. ఉన్న బంగళా సరిపోకపోతే మరో బ్లాక్ నిర్మించుకుంటే సరిపోయేదని, ఒక్క ఏడాది సమయంలోనే ఇంత పెద్ద బంగళా కట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana JAC Chairman Prof. Kodandaram fireda at CM KCR.
Please Wait while comments are loading...