కెసిఆర్ పాలన బాగున్నట్లే ఉంది: కోదండరామ్ (పిక్చర్స్)

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ విధానాలతో తమకేమీ సంబంధం లేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆదివారంనాడు నివాళులు అర్పించి, మాట్లాడారు. ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ నాలుగో వర్థంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు, సంస్థలు, వేదికలు ఘన నివాళులు అర్పించాయి.

ఆయన స్మృతిలో ఆదివారం హైదరాబాద్‌ సహా అనేక ప్రాంతల్లో పలు కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ కోసం అహరహం తపించిన మహోన్నత వ్యక్తి.. జయశంకర్‌ అని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాళి అర్పించారు.

జయశంకర్ సార్‌దే

జయశంకర్ సార్‌దే

కాగా, ఆర్‌ఎ్‌సఎస్‌ నుంచి ఆర్‌ఎస్‌యు వరకు అందరూ కలిసికట్టుగా ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రత్యేకరాష్ట్ర భావజాల వ్యాప్తికి రూపకల్పన చేసిన ఘనత జయశంకర్‌దేనని రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం కొనియాడారు.

స్మారక భవనం

స్మారక భవనం

జయశంకర్ పేరిట స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వాన్ని కోదండరామ్ కోరారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని జయశంకర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

మాకు సంబంధం లేదు..

మాకు సంబంధం లేదు..

ఏడాది పాలనలో ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. సాధించిన తెలంగాణ అభివృద్ధికి జయశంకర్‌ బాటలో మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

స్వయంప్రతిపత్తి కావాలి..

స్వయంప్రతిపత్తి కావాలి..

మిగతా రాష్ట్రాల మాదిరిగా తెలంగాణకు పూర్తి స్వయంప్రతిపత్తి ఉండాలని, హైదరాబాదులో ఆంధ్రా పోలీసులు మోహరించటం, సెక్షన్‌ 8 అమలు చేయాలనే ధోరణి సరికాదని కోదండరామ్ అన్నారు.

బంగారు తెలంగాణ కోసం...

బంగారు తెలంగాణ కోసం...

జయశంకర్‌ చూపిన బాటలో బంగారు తెలంగాణ సాధన కోసం కష్టపడి పనిచేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పలువురి నివాళి..

పలువురి నివాళి..

కార్యక్రమంలో పారిశ్రామికవేత్తల జేఏసీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, న్యాయవాదుల జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీగజెటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమతాభాయ్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం నేత కృష్ణయాదవ్‌, టీ టూరిజం కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాజమౌళి పాల్గొన్నారు.

జయశంకర్‌ వంటి సిద్ధాంతకర్తలను, త్యాగాలను చేసిన అమరులను కాంగ్రెస్‌ గుర్తించి, తెలంగాణ కలను సాకారం చేసింది. ఆయన ఆశయాన్ని నెరవేర్చిందని తెలిపారు. కానీ, తెలంగాణ ఏర్పడే చివరి రోజుల్లో ఆయన భౌతికంగా లేకపోవడం బాధ కలిగించిందని అన్నారు.

జయశంకర్‌ సిద్ధాంతాలకు అనుగుణంగా సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపొందించుకోవటానికి అందరూ పునరంకితం కావాలని టీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ వికాస సమితి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కోశాధికారి సి.సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+