ఎవరూ పట్టించుకోలేదు: కోమటిరెడ్డి బ్రదర్స్, అంజన్ ఆగ్రహం, ‘ఉత్తమ్ హఠావో..’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: శంషాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులు రసాభాసగా మారాయి. ఈ తరగతులకు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కోమటిరెడ్డి సోదరులను వేదికైకి ఆహ్వానించలేదు. దీంతో కార్యకర్తల మధ్యే వారిద్దరూ సుమారు 2గంటలపాటు కూర్చున్నారు.

ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిల అనుచరులు పలు నినాదాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తుండగా వీరు వ్యతిరేక నినాదాలు చేశారు.

komatireddy brothers serious on Uttam Kumar Reddy

'ఉత్తమ్ హఠావో.. కాంగ్రెస్ బచావో' అంటూ నినదించారు. ఆ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అనుచరులను వారించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో కొంతసేపు శిబిరంలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత కోమటిరెడ్డి సోదరులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

అంతకు ముందు కోమటిరెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడుతూ.. తమను వేదికపైకి ఆహ్వానించలేదని, అందుకే వెళ్లిపోతున్నామని చెప్పారు. మరోవైపు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా శిబిరం నుంచి అలిగి వెళ్లిపోయారు. శిక్షణ శిబిరంలో తనను సరిగా పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MLA Komatireddy Venkat Reddy and MLC Rajagopal Reddy on Saturday fired TPCC president Uttam Kumar Reddy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి