‘కేటీఆర్! అవార్డులు వస్తున్నాయా? కొంటున్నారా?: లక్ష్మారెడ్డి అప్పుడొక ‘బ్రోకర్’’

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేయగా, రేవంత్ రెడ్డి.. మంత్రి లక్ష్మారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. సమస్యలను వివరించేందుకు మున్సిపల్‌ మంత్రి అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వడం లేదని మండిపడ్డారు.
నల్గొండ, మిర్యాలగూడలలో అండర్‌ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీచేస్తా..

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీచేస్తా..

కాగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఈజీగా ఓడగొడతానని చెప్పారు.

 కేటీఆర్.. అవార్డులు వస్తున్నాయా? కొంటున్నారా?

కేటీఆర్.. అవార్డులు వస్తున్నాయా? కొంటున్నారా?

మంత్రి కేటీఆర్‌కు వస్తున్నవన్నీ సెల్ఫ్‌ డిక్లేర్డ్‌ అవార్డులేననికోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవాచేశారు. కేటీఆర్‌కు అవార్డులు వస్తున్నాయా? లేక కొంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. పనులు చేయని మంత్రికి అవార్డులు ఎలా ఇచ్చారో.. వారికి లేఖలు రాస్తానని అన్నారు. మంచి పనులు చేస్తే ప్రజలే అవార్డులిస్తారని కోమటిరెడ్డి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. నల్గొండలో రూ.30కోట్లతో డ్రైనేజీ పనులు పూర్తిచేయలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజలు డెంగ్యూ బారిన పడి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

 తండ్రీ కొడుకుల వద్దే..

తండ్రీ కొడుకుల వద్దే..

రాష్ట్రంలో ఇంత బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. కాళేశ్వరంలో కమీషన్ల కోసం ఆరాటపడుతున్నారని, ఏం చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌ల వద్దే అధికారం మొత్తం ఉందని అన్నారు.

 లక్ష్మారెడ్డి అప్పుడొక బ్రోకర్

లక్ష్మారెడ్డి అప్పుడొక బ్రోకర్

కాగా, మరో నేత రేవంత్ రెడ్డి మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు మంత్రి లక్ష్మారెడ్డి బ్రోకర్‌గా పనిచేశారని ఆరోపించారు. మంత్రి లక్ష్మారెడ్డి చరిత్ర మొత్తం తన దగ్గర ఉందని, జడ్చర్లలో ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్ విసిరారు. లక్ష్మారెడ్డి డాక్టర్ సర్టిఫికేట్ అసలుదా? నకిలీదా? అడగడం తప్పా? అని ప్రశ్నించారు. మాదిగాల పోరాటానికి తాము అండగా ఉంటామని రేవంత్ చెప్పారు. భారతి చనిపోయిన రెండు రోజుల్లో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+