కాళ్లు పట్టుకుంటే ఎమ్మెల్యే అయిండు - నెలకు రూ 5లక్షలు పంపుతా..!!
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సంచలన వ్యాఖ్యలు చేసారు. బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లు.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు కాళ్లు పట్టుకున్న నాయకు డు.. ఈ రోజు పరకాల ఎమ్మెల్యే అయ్యాడని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ మంత్రి పదవికి ఢోకా లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ.. బీఆర్ఎస్ లో ఉండి.. ఆ పార్టీలను నాశనం పట్టించిన నేతలు ఇప్పు డు కాంగ్రెస్ లో చేరి పార్టీని కరాబు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మాజీ ఎమ్మెల్యే కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్ లో సంచలనగా మారాయి. ఎన్నికలకు ముందు కాళ్లు పట్టుకున్న నాయకుడు.. ఈ రోజు పరకాల ఎమ్మెల్యే అయ్యాడని వ్యాఖ్యానించారు. ''నీ ఫామ్ హౌస్‌లో, నీ కోళ్ల ఫామ్‌లో నిన్ను కోడి కూడా పొడవదు.. నీకెందుకు గన్‌మెన్.. నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టే..'' అంటూ పరోక్షంగా ఎర్రబెల్లిని ఉద్దేశించి తీవ్ర విమర్శ లు చేశారు. ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఉన్నారని, ఇక్కడ రేవంత్‌రెడ్డి ఉన్నారని, సురేఖ మంత్రి పదవికి ఏం ఢోకా లేదని స్పష్టం చేశారు. సురేఖకు మూడు శాఖలున్నా.. పైసా రాదని, తానే నెలకు రూ.5లక్షలు పంపుతున్నానని పేర్కొన్నారు.

దీనికి కొనసాగింపుగా ఎవరైనా మీసాలు, గడ్డాలు గీయించుకుంటారు.. కానీ, ఈ నాయకుడైతే కను బొమ్మలు గీయించుకుంటడు అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేసారు.. టీడీపీలో 15ఏళ్లు ఉండి, మంత్రి పదవులు అనుభవించి ఆ పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు.. తర్వాత బీఆర్‌ఎస్ లో చేరి కేసీఆర్‌ను, కేటీఆర్‌ను తప్పుదోవ పట్టించి నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి.. పార్టీని కరాబు చేస్తున్నారని మురళీధర్‌రావు విమర్శించారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఉద్దేశించి ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఇజ్జత్, మానవత్వం ఉంటే... బయటి పార్టీ నుంచి వచ్చిన వాళ్లు.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు.
పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుస్మితా పటేల్ పోటీ చేస్తుందని ప్రకటిం చారు. వరంగల్ తూర్పులో కొండా సురేఖ మరోసారి పోటీ చేస్తుందని, తనకు పార్టీ ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం వస్తుందని మురళీ ధీమా వ్యక్తం చేసారు. ఇప్పుడు మురళీ చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో సంచలనంగా మారాయి. మురళీ టార్గెట్ చేసిన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications