వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రబెల్లితో కొండామురళి ఢీ; పాలకుర్తిపై రేవంత్ రెడ్డి ప్లాన్; ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్టేనా!!

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ పరిణామాలలో మార్పు జరగబోతుందా? కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమకు పట్టు ఉన్న స్థానాలపై దృష్టి కేంద్రీకరించిందా? ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గాన్ని టార్గెట్ చేయబోతున్నారా? ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష్యంగా చిరకాల రాజకీయ ప్రత్యర్థి కొండా మురళిని పాలకుర్తి నియోజకవర్గంలో రంగంలోకి దింపబోతున్నారా? అన్న చర్చ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది.

పాలకుర్తిలో ఎర్రబెల్లితో కొండా మురళి ఢీ.. రేవంత్ వ్యూహం

పాలకుర్తిలో ఎర్రబెల్లితో కొండా మురళి ఢీ.. రేవంత్ వ్యూహం

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తమకు పట్టు ఉన్న స్థానాలపై, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. అందులో భాగంగా టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రధానంగా ఫోకస్ చేస్తూ, కాంగ్రెస్ కు బలం ఉన్న స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలకుర్తి ఎమ్మెల్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించటం కోసం బలమైన ప్రత్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు బద్ధ శత్రువు అయిన కొండా మురళిని పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.

పాలకుర్తిలో కొండాను రంగంలోకి దించే వ్యూహం వెనుక కారణం ఇదేనా?

పాలకుర్తిలో కొండాను రంగంలోకి దించే వ్యూహం వెనుక కారణం ఇదేనా?

పాలకుర్తి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. నియోజక వర్గంలో ఉన్న మొత్తం ఓట్లను 70 శాతం పైగా ఓట్లు బీసీ సామాజిక వర్గానికి చెందినవే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే బిసి సామాజిక వర్గానికి చెందిన కొండా మురళీధర్ రావును పాలకుర్తి నియోజకవర్గం లో రంగంలోకి దించాలని, ఎర్రబెల్లి దయాకర్ రావును ఢీ కొట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తుంది. ఇంతకాలం పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో తలపడిన జంగా రాఘవరెడ్డి, కొండ మురళి శిష్యుడు కావడంతో కొండా మురళి రాకను జంగా రాఘవరెడ్డి వ్యతిరేకించే అవకాశాలు లేవు.

జూన్ 10వ తేదీన పాలకుర్తిలో భారీ బహిరంగ సభ .. కొండా ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

జూన్ 10వ తేదీన పాలకుర్తిలో భారీ బహిరంగ సభ .. కొండా ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్

ఇక ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్దులయిన ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండ మురళి నేరుగా తలపడిన దాఖలాలు కూడా లేవు. ఈ క్రమంలోనే పాలకుర్తి లో కొండ మురళి తో పోటీ చేయిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావుకు చెక్ పెట్టవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో జూన్ 10వ తేదీన పాలకుర్తిలో టిపిసిసి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించి, ఆ బహిరంగ సభ వేదికగా కొండా మురళి పాలకుర్తి లో కాలు పెట్టబోతున్నారని విశ్వసనీయ సమాచారం. వేలాది మంది సమక్షంలో కొండా మురళి పాలకుర్తి లో అడుగు పెడతారని సమాచారం. ఇక ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది.

పాలకుర్తిలో కొండా అనుచరుల సర్వే.. ఎర్రబెల్లి వర్సెస్ కొండా .. అదే జరిగితే సమరమే!!

పాలకుర్తిలో కొండా అనుచరుల సర్వే.. ఎర్రబెల్లి వర్సెస్ కొండా .. అదే జరిగితే సమరమే!!

ఇక కొండ మురళి ఎంట్రీ నేపథ్యంలో ఇప్పటికే పాలకుర్తి నియోజకవర్గాన్ని కొండ అనుచరులు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. పార్టీలో యాక్టివ్ గా పనిచేసిన వారు ఎవరు? తమకు అనుకూలంగా వచ్చే వారెవరు? తటస్తులు ఎవరు? అన్నదానిపై వివరాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు బలం ఏమిటి? బలహీనత ఏమిటి అన్న అంశాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మరి ఎర్రబెల్లి దయాకర్ రావు ని ఢీ కొట్టాలని కొండ మురళిని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా రాజకీయ ప్రత్యర్ధులు ఇద్దరూ ఒకే చోట నుంచి ఎన్నికల బరిలోకి దిగితే రసవత్తర సమరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary
Congress focused on Palakurti. Revanth Reddy plan to field Konda Murali on Errabelli Dayakar Rao. It is in talk that a huge public meeting will be held on June 10 and Konda Murali will make his entry through that meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X