Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టిన కొండా మురళి!

కొండా మురళి ఓరుగల్లు రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పేరు. ఒకపక్క సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కొండా మురళి సొంత పార్టీ నేతల పైనే కాదు, ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా వదిలిపెట్టకుండా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కుంటున్నారు.

ఎర్రబెల్లి ఫ్యామిలీని టార్గెట్ చేసిన కొండా ,మురళి
ఇక ఇప్పటికే వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పైన తమదైన విమర్శలు చేసిన కొండ మురళి దంపతులు, తమ మాటల దాడిలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా మరోమారు కొండా మురళి వరంగల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి అన్న ఇంటిపేరుతో పుట్టిన వారంతా ఎర్ర బల్లులే అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు ఫ్యామిలీని టార్గెట్ చేశారు.

Konda Murali who has been put in risk Konda Surekha minister post with his comments

తన వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం
అంతేకాదు ఇదే సమయంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ను, బిజెపి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావును, బి ఆర్ ఎస్ నాయకుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును టార్గెట్ చేసే విమర్శలు గుప్పించారు.2023 ఎన్నికలలో వరంగల్ తూర్పు నుంచి సురేఖను గెలిపించిన విషయంపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

కొండా మురళి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు
ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని ఎర్రబెల్లి ప్రదీప్ రావు భయపెడుతున్నాడని, తాను భయపడేది లేదని కొండా మురళి స్పష్టం చేశారు.తాజాగా కొండా మురళి చేసిన వ్యాఖ్యల పైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు. కొండా మురళి ఎన్నికల ఖర్చులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తామని ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతామన్నారు.

కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు
వరంగల్ తూర్పు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కొండా సురేఖ చోటు దక్కించుకున్నదని దీనికి కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. కొండా మురళి స్వయంగా తాను 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారని అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేర్కొన్నారు. మొత్తంగా కొండ మురళి చేస్తున్న వ్యాఖ్యల రచ్చ చిలికి చిలికి గాలి వానగా మారి కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+